స్వతంత్ర భారతం ;-యామిని కోళ్లూరు;-చరవాణి : 0091502673033
 
ప్రక్రియ :  సున్నితంబు 
================  
భారతావని సంస్కృతి సంప్రదాయాల  
        భిన్నత్వంలో ఏకత్వంకి ఆలయం
         బహుభాషలకి నెలవైన నిలయం
         చూడచక్కని తెలుగు సున్నితంబు 

సహయనిరాకరణ శాంతి సత్యగ్రహాలు 
      క్విట్ఇండియా దండి సత్యగ్రహోలు
    సుదీర్ఘమైన తిరుగుబాటు పోరాటాలు 
       చూడచక్కని తెలుగు సున్నితంబు 

 ఆంగ్లేయుల దాస్యశృంఖలాలు చేదించి
        దేశసేవ సంరక్షణధ్యేయంగా జనియించి 
      త్యాగధనులు వీరులు అహర్నిశలుశ్రమించి
          చూడచక్కని తెలుగు సున్నితంబు 

 స్వేచ్ఛాస్వాతంత్య్రంకి మోగే సమరం 
    భారతీయులు ఎలుగెత్తూదే సమరశంఖం
    అడుగడుగునా ఏరులైపారే రక్తప్రవాహం 
       చూడచక్కని తెలుగు సున్నితంబు 

 డెబ్భైఐదు వసంతాల వజ్రోత్సవాలు 
        అంబరాన్నంటే వినువీధుల్లో సంబరాలు
     చేతులెత్తిచేద్దాం భరతమాతకి వందనం
       చూడచక్కని తెలుగు సున్నితంబు..

కామెంట్‌లు