ఒరేయ్ పల్లెటూరోడా అని కొంతమంది ఎద్దేవా చేయడం వింటూ ఉంటాం. ఆహార్యం లోనూ, ఆహారంలోనూ కాకుండా ప్రవర్తనలో కూడా ఎంత భేదం ఉంటుందో మనం గమనించవచ్చు పల్లెల్లో నివసించే ఎవరినైనా పరిశీలించండి నిజాయితీ వారి సొత్తు. మర్యాద మన్నన వారి అలవాటు ఎదుటివాడు ఆకలితో ఉన్నాడని తెలిస్తే ఏ తల్లయినా భోజనం పెట్టకుండా ఉండదు. నిరాడంబర జీవితం గడపడం వారి జీవితంలో ఒక భాగం ఆడంబరాలకు కానీ, డాబు సరికి పోవటం కానీ, వారు చేయరు. గ్రామంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, ఆడపిల్లలు చిన్నవారైతే పట్టు లంగాలు కట్టుకొని బంగారు తల్లుల్లా వస్తారు. పెద్ద వారయితే కంచి చీరలు కట్టి పెద్దరికం నిలబెట్టుకుంటూ వస్తారు. ఎవరూ పేరు పెట్టి పిలుచుకోరు. బావ, అన్న, అక్క, చెల్లి వరసలు తప్ప మరోలా పిలుచుకోరు. కింద కూర్చుని భోజనం చేస్తూ వరసలతో ఎన్ని హాస్యోక్తులు చెప్తారో నగరవాసులకు తెలియదు. కోటు, బూటు సూటు వేసుకొని హోటల్ కు దగ్గర వచ్చినట్లుగా ఇంట్లో కూడా కుర్చీలలో కూర్చొని టేబుల్ మీద ఉన్న దానిని వడ్డించుకుని తినడం. ఏది ఆరోగ్య పద్ధతి ఆ కోణంలో ఎవరూ ఆలోచించరు అదంతా నాగరికత లక్షణం అనుకుంటారు ఈనాటికీ శివ నాగిరెడ్డి గారు తమ గ్రామంలో ఎలా ప్రవర్తించారో అలాగే ఉంటారు ఎలాంటి డాంబికాన్ని ప్రదర్శించరు భార్యాబిడ్డలతో ఆత్మీయంగా ఆహ్లాదంగా కాలం గడుపుతారు మనవళ్లు మనవరాళ్లు అయితే భుజాలమీద ఎక్కి వారిని ఎలా ఆటపట్టిస్తారో తెలియదు దానిలో ఉన్న అందం, ఆనందం నాగరికతలో ఉందా? ఎప్పుడు షోకులు చేసుకోవాలో, సమయపాలన ఎలా ఉండాలో పల్లెవాసులకు తెలిసినట్లుగా పట్టణవాసులకు తెలియదు అంటే అది సాహసమే కావచ్చు. నేడు పల్లెల్లో పట్నం వాసులను చూసి కొంతమంది వారిని అనుకరించ వచ్చు కానీ అది వారి గ్రామ సంస్కృతి కాదు అది వారికి తెలుసు అలా కొంత మందిని చూసి అందరిని ఆ గాటలో కట్టడం మంచిది కాదు పల్లె వాసులలో ఎవరిని చూసినా కుళ్ళు కుతంత్రం లేకుండా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ప్రశాంత జీవితానికి అలవాటు పడిన వాళ్లే అందుకే అంత ఆరోగ్యంగా ఉంటారు పాడిపంటలతో కూడా. కానీ ఇక్కడ నగరంలో ప్రతిదీ కల్తీ పిల్లలకు ఇచ్చే పాలల్లో పెద్దలు తినే ఆహారంలో చివరకు మనసులో కూడా కల్తీలే జీవితంలో నాటకాలు ఆడడం నగర వాసులకు అలవాటు తప్ప పల్లెవాసులకు కాదు. ఆ పల్లె జీవితాన్ని ఆసాంతం అనుభవించిన రెడ్డి గారు ఆరోగ్యంగా ప్రశాంత జీవితాన్ని గడపడానికి కారణం తన గత జీవితాన్ని మర్చిపోకుండ ఉండడమే. వారి నవ్వుల్లో పసిపిల్లవాడు కనిపిస్తాడు కపటం లేని మాటల్లో సంస్కారం కనిపిస్తుంది అందుకే మేము అంతా వారిని ఆప్యాయంగా చూస్తాం. ఇవాళ నగరాలలో భోజనాలు చేయడం అంటే యాచకుల వలె ప్రవర్తించడమే కదా.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (14);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి