గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (26);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నాకు అత్యంత ఆప్తులు నా  జీవితాన్ని నిలబెట్టిన వారు గురువుగారు నండూరి సుబ్బారావు గారు  ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు. మంచికి మంచి జరుగుతుంది చెడుకు చెడు జరుగుతుంది అని దాన్ని వారి మాటల్లో నీవు నలుగురికి మంచి చెయ్ 40 మంది వచ్చి మీ బిడ్డలకు మంచి చేస్తారు పెడతారు ఒకరి కడుపు కొట్టు  100 మంది నీ బిడ్డల కడుపులు కొడతారు కనుక చెడు గురించి ఆలోచించకు అని. అయితే ఈ మానవ శరీరం సాత్విక రాజస తామసాలతో కూడినది తన గురించి తాను ఆలోచించి నట్లుగా ఇతరులను గురించి ఆలోచించడం చేతల్లో కష్టం  ఎదుటివారు ఒక మంచి వస్తువు కొంటె దాని కన్నా మంచి దానిని కొనాలి అనుకోవడం నైజం. కానీ అది శాశ్వతం కాదు తొందర్లోనే అది నాశనం కావాలని కోరుకోవడం దుర్బుద్ధి  పైకి చెప్పకపోయినా చాలామందికి జరిగేదే  అది. మనిషి జన్మతః  మనీష (బుద్ధి)  తో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి మనిషిని చెడు మార్గం  లోను మంచి మార్గంలో నడిపించడానికి అవకాశాలు ఉన్నాయి. దానిని దాటాలి  అది మన కర్తవ్యం. కానీ అది జీవితంలో సాధ్యమా?  అరిషడ్వర్గాలకు మూలం ఈ శరీరం  ఎప్పుడు కామం వస్తుందో, ఎప్పుడు మోహం వస్తుందో దానికే తెలియదు  ఎప్పుడు క్రోధం వస్తుందో కూడా తెలియదు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడానికి  మనమేమి ఋషిపుంగవులం కాదు కదా? చంచలమైన మనస్సును అజ్ఞానంలో నుంచి తప్పించడం మన వల్ల కాదు.
వ్యాస వాల్మీకి మహర్షుల ప్రాచీన గ్రంథాలు చదివి  ఎదుటివారు ఏదైతే మన మనసు కష్ట పడే విధంగా మాట్లాడాతారో అది ఇతరులతో మాట్లాడకు అన్న విషయాన్ని గ్రహించిన జ్ఞాని శివ నాగిరెడ్డి గారు బుద్ధ భగవాన్ వ్రాసిన మూడు పిటకములను అధ్యయనం చేసి ధర్మ మార్గంలో జీవితాన్ని  తీర్చి దిద్దుతున్న వ్యక్తి ఎవరితో ఏది మాట్లాడవలసి వచ్చినా  ఆచితూచి మాట్లాడడం వారికి అలవాటు ఎవరినైనా చివరకు నాలుగో తరగతి ఉద్యోగి నైనా  ఎప్పుడూ ఏకవచన ప్రయోగం చేయలేదు బహువచనంలో  మీరు అంటారు. ఏ పేరు పిలిచినా చివర గారు తగిలించడం మరిచిపోరు. నడకల్లోనే కాదు నడతల్లో కూడా జీవితాన్ని అధ్యయనం చేయాలనేది వారి పెద్దలు చెప్పిన సూక్తి. దానిని చెప్పడం తేలికే ఆచరించడమే కష్టము  ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని తన జీవితాన్ని  ఆనందమయం చేసుకున్నారు  మా శివ నాగి రెడ్డి గారు వారి దగ్గర నేర్చుకోవలసినవి అనేక విషయాలు ఉన్నాయి.

కామెంట్‌లు