నాటకము అంటే బళ్ళారి రాఘవాచార్య అని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరతారు. పౌరాణికాలు జానపదాలు ఎన్నో ప్రదర్శించారు. గురజాడ అప్పారావు గారు రచించిన కన్యా శుల్కంలో గిరీశం పాత్ర వీరే వెయ్యాలి అన్నంతగా నటించారు కానీ ఒకసారి ఆపద్ధర్మంగా బందా కనక లింగేశ్వర రావు గారు నటిస్తే నా కన్నా అద్భుతంగా చేశాడు ఇక నేను నటించకపోయినా ఫర్వాలేదని వేదికపైనే ప్రశంసల వర్షం కురిపించారు. అట్టి కళాకారుల లక్షణాలు సామాన్యంగా రెండు రకాల వారూ ఉంటారు. ఉత్తమ కళాకారుడు తనకన్నా పై స్థాయిలో ఉన్న కళాకారుని పోల్చుకుంటూ వారితో సరిసమానంగా అయిన వేయాలి లేక వారి కంటే ఒక అడుగు ముందుకు వేయాలి అన్న తపనతో, అంకితభావంతో కృషి చేసి సఫలీకృతులవుతారు. రాజ బాట నిర్మించుకుంటాడు. అదే మరొకరు అయితే తనకన్నా తక్కువ వారితో పోల్చుకొని తాను ప్రయత్నం చేయడమే మానుకుంటాడు. ఇంకా తనకి ప్రగతి ఎక్కడ ఉంటుంది.
వీరిద్దరినీ ప్రక్కనపెడితే శివ నాగ రెడ్డి గారిది ప్రత్యేక బాణి వారు ఎవరితోనూ పోల్చుకోవడం ఎవరు చూడలేదు తన ప్రయత్నం తాను చేస్తూ గతంలో తాను చేసిన పనికి ఏ కొంచెమైనా మెరుగులు దిద్ద గలమా అని ఆలోచించి మరి కాస్త అందంగా వచ్చేలా ప్రయత్నం చేస్తారు తప్ప ఒకరిని అనుసరించడం మరొకరిని అనుకరించడం వారి జీవితంలో లేదు ఇకముందు రాదు కూడా. అలాంటి ఆత్మస్థైర్యం లేనివారు
తనపై తమకు నమ్మకం లేని వారు ఇలాంటి కార్యాలను చేయాలని తలపెట్టారు. తల పెట్టిన తరువాత ఎన్ని అవాంతరాలు వచ్చి పడ్డా ఏ స్థితిలోనూ వెను తిరిగి వెళ్లడం జరగదు. అలాంటి ప్రజ్ఞా పాటవాలు కలిగిన వారు మా శివ నాగి రెడ్డి గారు ఆరంభించరు నీచ మానవులు అన్న భర్తృహరి సుభాషితానికి వీరు ప్రత్యక్ష నిదర్శనం. అందుకే మా అందరికీ వారు ఆత్మీయులు అయ్యారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి