అమ్మ నాన్న కష్టం;- డి. రాజ్ కుమార్-8వ తరగతి- అబ్దుల్లాపూర్ మెట్-చరవాణి.9121015314
మన పుట్టుకకు కారణం అమ్మ. 
అమ్మలేనిదే రాబోయే తరాలు లేవు. 
పుట్టిన తర్వాత మంచి చెడు చెప్పేవాడు నాన్న.
 కానీ మన కోసం ఎంతో కష్టపడి కూలిపని చేసి మనల్ని పెంచుతున్నారు.
 మనం అదంతా అర్థం చేసుకోకుండా మనల్ని ఎవరైనా నీకు ఎక్కువ ఎవరు ఇష్టం అంటే మనం సినిమాలో నటించే వాళ్ళ పేర్లు చెబుతుంటాను కానీ మనల్ని కనిపించిన అమ్మానాన్నల గురించి చెప్పం. అలా చేయవద్దు మన అమ్మానాన్నల గురించి గర్వంగా చెప్పుకోవాలి.
 అలాగే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలకు కూడా ఒకటే చెప్పాలి చదువుకోవాలి అమ్మానాన్నల బాధను అర్థం చేసుకోవాలి చదవాలి.
 వాళ్లకు మంచి పేరు తీసుకుని రావాలి వాళ్ళు అప్పుడు గర్వంతో తలెత్తుకునే అవకాశం ఉంటుంది.
 రేపు మనం ఒక ఒక పెద్ద స్థాయిలో ఉండాలి.
 మనల్ని మన అమ్మ తొమ్మిది నెలలు మోస్తుంది.
 అందుకే మన పుట్టుకకు కారణం. ఇంకా నాన్న విషయానికి వస్తే రోజు కూలి పనికి పోయి మన ఆకలిని  తీరుస్తాడు. కాబట్టి వీళ్లిద్దరి సమానంగా చూడాలి.


 గౌరవిద్దాం గౌరవిద్దాం...! అమ్మానాన్నలను గౌరవిద్దాం...!
 తెలుసుకుందాం తెలుసుకుందా అమ్మానాన్న చేసే కష్టాన్ని తెలుసుకుందాం...!
 బాధ పెట్టవద్దు,బాధ పెట్టవద్దు అమ్మానాన్నలని బాధ పెట్టవద్దు...!
 సహాయం చేద్దాం,సహాయం చేద్దాం అమ్మానాన్నలకు సహాయం చేద్దాం..


కామెంట్‌లు