పట్టుదల; యు . నిహారిక . 9 . e . జడ్ పి హెచ్ ఎస్. ఇందిరానగర్, సిద్ధిపేట . సెల్ 9848824085
 అనగనగా రామాపూర్ అనే చిన్న గ్రామంలో నిత్యా అనే అమ్మాయి ఉండేది . నిత్యాకి డాన్స్ అంటే చాలా ఇష్టం. నిత్యా వాళ్ళ అమ్మానాన్నలు కూడా చాలా ప్రోత్సహించేవారు. ఆ గ్రామంలో వాళ్లే ధనవంతులు కూడా. ఒకరోజు నిత్య వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పినా వినకుండా బయటకు వెళ్తుంది. అప్పుడు నిత్యాకి కారు ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు. వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేస్తారు. నేను ఆమెకు వైద్యం చేశాను కానీ ఆమె కాలు మాత్రం పోయింది నన్ను క్షమించండి అని డాక్టర్ అంటారు. అప్పుడు వాళ్ళ అమ్మానాన్నలు చాలా కంగారు పడుకుంటూ నిత్య దగ్గరికి వస్తారు. ఎందుకంటే నిత్యాకి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి .నిత్యాముందు ఏం మాట్లాడాలో తెలియలేదు వాళ్ళ అమ్మానాన్నలకి. అప్పుడు నిత్య అంటుంది నేను నా కాలిని మాత్రం పోగొట్టుకున్నా నా ఆశని కాదు అని అంటుంది నిత్య. కొన్ని రోజుల తర్వాత ఒక డాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ చాలా కష్టపడి  ఒంటి కాలితో డాన్స్ నేర్చుకుంటుంది. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మానాన్నలు కూడా చాలా సంతోషపడుతారు. ఒకరోజు నిత్య డాన్స్ ని వాళ్ల నాన్న యూట్యూబ్ లో పెడతారు. మరుసటి రోజు నిత్య డాన్స్ చూసి శేఖర్ మాస్టర్ ఆమె కోసం

ఆడిషన్ పెడతారు. అక్కడ నిత్య చాలా బాగా ఒంటి కాలితో డాన్స్ చేస్తుంది. అప్పుడు నిత్య డాన్స్ చూసిన వాళ్ళందరూ నిత్యాని మెచ్చుకుంటారు  .
 నీతిఏదైనా సాధించవచ్చు అని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు.
కామెంట్‌లు