గణపయ్య పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
బొజ్జ గణపయ్య విఘ్నాల గుజ్జుదీసి
విజయ బాటలో నడిపించు వృద్ధి గూర్చ
కష్ట జీవుల వేదన గాంచిదీర్చ
యేక దంతుండు వచ్చేను యేట యేట 
తే.గీ
స్వచ్ఛమైనట్టి నవరాత్రి సంబరములు
చవితిరోజున మొదలౌను సందడిగను
వాడవాడన కొలువైన వరగణపతి 
భక్తులను గాంచుచుండగన్ పావనంబె

కామెంట్‌లు