సమస్యా పూరణం;-మమత ఐలకరీంనగర్9247593432
 *కలము యు కాగితమ్ములును కావలెనా కవితాస్రవంతికిన్*
చ.
కలవరమొంద జెప్పెనట గాంచిన దృశ్యము మౌనివెంటనే
సులువుగ శ్లోకమై కుదుర సుస్వర వాక్కులు బ్రహ్మ మెచ్చగన్
జలజల భావజాలములు జారుచు వాహిని వోలె దూకగన్
*కలము యు కాగితమ్ములును కావలెనా కవితాస్రవంతికిన్*

కామెంట్‌లు