స్వతంత్ర భారతం;-వనపర్తి గంగాధర్;-సెల్ :9440146435
 ప్రక్రియ:సున్నితం
==============
సుదీర్ఘ పోరాట ఉద్యమం
ఆంగ్లేయ నిరంకుశ పాలనం
అంతమయిన ఆనంద సుదినం
చూడచక్కని తెలుగు సున్నితంబు

సత్యం అహింసా ధర్మం
ఆయుధాలే పోరాట అస్త్రాలై
సాగిన అహింసాయుత ఉద్యమం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఎందరో వీరుల త్యాగధనుల
త్యాగాల ఫలం స్వతంత్రభారతం
అనుభవిస్తున్నాం ఆనందంగా అందరం
చూడచక్కని తెలుగు సున్నితంబు

పోకూడదు ఆత్యాగాలు వృధాగా
నిలబడదాం భారతాన్ని ఉన్నతంగా
కలిసి నడుద్దాం ఐక్యంగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రపంచ యవనికపై ఎగరేద్దాం
మన మువ్వన్నెల పతాకాన్ని
నిలబడదాం దేశాన్ని ఉన్నతశిఖరాన
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు