బాల పంచ బదులు
================
1. ఇంటి ముందు వేప చెట్టు!
వచ్చే గాలిని వడకట్టు!
ఆరోగ్యాన్ని పంచిపెట్టు!
మన జీవితం నిలబెట్టు!
వేప ,
ఆరోగ్య కంటి పాప ,రామా!
2. ఆ చెట్టు ప్రతిభాగం సార్థకం!
ఆయుర్వేదాన అగ్రతాంబూలం!
వేపతో జరుగు గృహ వైద్యం!
ఎన్నోనివారణలు సుసాధ్యం!
వేప ,
ఆరోగ్యం కంటిపాప రామా!
3.దాని మరోపేరు "నలభైచెట్టు"
నలభై రోగాలు అరికట్టు !
పచ్చగా కళకళలాడే ఆ చెట్టు!
ఇంటిని వేయికళ్ళతో కనిపెట్టు!
వేప ,
ఆరోగ్యం కంటిపాప రామా!
4. వేపపుల్లతో దంత ధావనం! వేపపువ్వు ఉగాది రసాయనం!
చివుళ్ళేమధుమేహ నివారణం!
ఆకుల పడక ,
అమ్మవారు మాయం!
వేప ,
ఆరోగ్యం కంటి పాప రామా!
5. వేపగుజ్జు క్రిమిసంహారం!
వ్యవసాయాన వినియోగం!
వేపకలప చవకలో లభ్యం!
గృహోపకరణాల నిర్మాణం!
వేప ,
ఆరోగ్యం కంటి పాప రామా!
6. చుండ్రు వేపతో ముగింపు!
వేడివేపాకునీళ్ల చిలకరింపు!
తెచ్చు ముఖాన నిగారింపు!మొటిమల మచ్చలతొలగింపు!
వేప ,
ఆరోగ్యం కంటి పాప రామా!
7.లేతచిగుళ్ళుపసుపు లేపనం!
దురదలు,దద్దుర్లు, మాయం!
వేప చింతాకుల మిశ్రమం!
కామెర్ల వ్యాధి సమాధానం!
వేప ,
ఆరోగ్యం కంటి పాప రామా!
8. వేయించిన వేపాకు,
నెయ్యిల చూర్ణం!
ఫుళ్ళ నివారణ,
మరి సంపూర్ణం!
వేప బెరడు ,
పంచదారల చూర్ణం!
సేవనం,
మూత్రవ్యాధి నివారణం!
వేప,
ఆరోగ్యం కంటిపాప రామా!
9. వేపాకులు,
మిరియాలు కలపడం!
పరగదుపున ,
నమిలి మింగడం!
అంటువ్యాధులు ,
ఆమడ దూరం!
డెంగ్యూ ,చికెన్ గున్యా,
దివ్య ఔషధం!
వేప ,
ఆరోగ్యం కంటి పాప, రామా!
10. ఈ మధ్య వేపకి తెగుళ్లు!
ఉత్తరాఖండ్ లో మొదళ్ళు!
రసాయనాల తయారి!
గోరింటాకు రసం పిచికారి!
వేప ,
ఆరోగ్యం కంటి పాప రామా!
_________
ఆరోగ్య దేవత!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి