గురు-జాడ;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.

 సెప్టెంబర్ 21గురజాడజయంతి శుభాకాంక్షలు అందిస్తూ,
=========================================
1. నీ పేరు స్మరిస్తే చాలు!
    తెలుగువారి ,
     గుండె ఉప్పొంగి తీరు!
    ఎవరైనా నీ మార్గం,
           అనుసరించి తీరు!
    వాడుక భాష ,
              ఉద్యమం హోరు!
   నీవు సాహిత్యానికి ,
                    అద్దిన సౌరు!
2. కవిత్వానికి ,
                 నీవు కట్టుబాటు!
   కథలకు ,
           చుట్టావు దిద్దుబాటు!
సాహిత్యాంతం నాటకం ధ్రువం,
        నిజం కన్యాశుల్కం!
  దురాచారం దూరం,
  కన్యాశుల్కం శాశ్వతం!
 ఓ వైతాళికుడా,
    సాహిత్య ఆకాశాన,
              నీవే ధ్రువ నక్షత్రం!
3. దేశాన్ని ప్రేమించమన్నావు!
    మంచి పెంచమన్నావు!
   దేశమనెడి దొడ్డవృక్షాన్ని,
   చెమటతో తడపాలన్నావు! 
   ఒట్టి మాటలు,
             కట్టి పెట్టాలన్నావు!
   గట్టి మేలు,
             తల పెట్టాలన్నావు!
   మిడిసిబాటు కాదు,
   దిద్దుబాటు జరగాలన్నావు!
   మగవాడికైనా ఆడదానికైనా,
         శీలం ఉండాలన్నావు!
4. మహాశయా!
     మా తెలుగు కథ,
           అడ్డం తిరుగుతోంది!
  మా వెధవాయిత్వం ,
           వెర్రితలలు వేస్తోంది!
   అయితేనే ,నీ గురు-జాడ
            మాకు అడుగుజాడ!
  మా ప్రస్థానం వెలుగుల వైపు!
   మా బతుకుల్లో,
                    మార్పు తూర్పు!
   నీ దేశభక్తి గీతం,
   విశ్వజనజాగృతగీతం! 
  అహర్నిశలు చైతన్య సంకేతం!
_________

కామెంట్‌లు