బాల పంచపదులు==============1. దేవుడు లేడు,అనేవారు ఉంటారు!సూర్యుడు,లేడని ఎవరంటారు!సూర్యుడు లేక ,ఎవరుంటారు!సూర్యుడితోనే,బతుకంటారు!సూర్య వందనం ,ఆరోగ్యప్రదం,రామా!2. సూర్యోదయం శుభోదయం!నిత్యం సువర్ణ కిరణోదయం!జనజీవన చైతన్య ప్రదాయం!విశ్వగమన మూలాధారం!సూర్య వందనం ,ఆరోగ్యప్రదం, రామా!3. ఆరోగ్యం ఆదిత్య ఆధీనం!నిత్యం సూర్యస్తోత్ర పఠనం!సూర్య నమస్కారాల,వ్యాయామం!మరి ఆరోగ్యమే,మహాభాగ్యం!సూర్య వందనం ,ఆరోగ్యప్రదం, రామా!4. నిత్యం ప్రజ్వరిల్లే గోళం!అనంత శక్తి సమన్వితం!సౌరశక్తి సర్వత్రా వినియోగం!అది తరగని ఇంధనధనం!సూర్య వందనం,ఆరోగ్య ప్రదం,రామా!5. సూర్యగ్రహణం పడుతుంది!కాసేపుఉండి విడిపోతుంది!కష్టాల గ్రహణం పడుతుంది!సహిస్తే మరి విడిపోతుంది!సూర్య వందనం,ఆరోగ్యప్రదం, రామా!6. సూర్యరశ్మితోనే సాధ్యం!సకలచర్మరోగ నివారణం!విటమిన్ డి పుష్కలం!జీవనం ఆరోగ్య వర్ధనం!సూర్య వందనం,ఆరోగ్యప్రదం ,రామా!7. రథసప్తమి పరమాన్నం!అత్యంత పవిత్రం మధురం!కోణార్క్, అరసవెల్లి ,దర్శనం!జీవితం మరి పరమ పావనం!సూర్య వందనం,ఆరోగ్యప్రదం ,రామా!_________
జీవన మూలం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి