కళారవి -బహుముఖ పవి;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
పంచపది
========
అడవి బాపిరాజు వర్ధంతి సెప్టెంబర్ 22
వారికి స్మృత్యంజలి ఘటిస్తూ
====================
1.ఆయనది బహుముఖ ప్రజ్ఞ,
       చూపాడు భీష్మ ప్రతాపం!
   ఆయన బహుముఖ వజ్రం,
       ప్రతితలం దివ్య ప్రకాశం!
  సాహిత్యన ప్రతిరూపం,
    ఆయన కలాన అపురూపం!
"వడగళ్ల వాన" సహచరి,
         "తొలకరి" జైలు కాలం! గాంధేయవాది ,ఖద్దరుధారి,
    దళిత జనోద్దరణం,పివిఎల్!

2. ఎక్కడ ఉంటే అక్కడే,
           సరస్వతి విహార క్షేత్రం!
   ఉపన్యాసం మాట, పాట,
    ఆటల త్రివేణి సంగమం!
  బావా బావా పన్నీరు,
 పాటతో బాపిబావ విఖ్యాతం!
"నారాయణరావు" ,
"వేయి పడగలు" సరి నిర్ణయం!
హిమబిందు,కోనంగి, నేలతల్లి,

 
రచన హృదయంగమం,
                               పివిఎల్!

3. భారతీయ చిత్రకళ పుణ్యం,
        వారి హస్త నైపుణ్యం!
  "సముద్ర గుప్తుడు", "తిక్కన",
          డెన్మార్కులో భద్రం!
 "భాగవత పురుషుడు",   
         "ఆనందతాండవం",
                      మ్యూజియం!
   సిగేరియా కుడ్యచిత్రాలు,
        సింహళాన సింగారం!
ఆంధ్రారవీంద్రుడు ,
     అడవివారి చిన్నోడు,
            కళాదక్షుడు, పివిఎల్!
_________

కామెంట్‌లు