నిజాం నిరంకుశత్వం భాగ్యనగర దౌర్భాగ్యం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు, 9442058797.
 నేటి పంచ పది
============
1. దేశమంతా స్వాతంత్ర్యం,   
        వెలుగలు ప్రసరించాయి!
   తెలంగాణ నిజాం నిరంకుశ,
      తిమిరాలే నిలిచాయి!
 నిరంకుశజ్వాల ,రజాకార్ల
,. చర్యలు  ఆజ్యాలయ్యాయి!
అంతటా హత్యాకాండలు,
 దోపిడీలు.  రాజ్యమేలాయి!
మృగాలకు తీసిపోని రజాకార్ల,
 ఆకృత్యాలు సాగాయి,
                           పివిఎల్!
2. యువకమ్యూనిస్టుల,
  సాయుధపోరాట వైపల్యము!
స్టేట్ కాంగ్రెస్ ,ఆర్య సమాజం, 
             చర్యలు నిష్ఫలము!
తెలంగాణ ప్రజలకు ,
         దొరకని సమాధానము!
 నిజాం నిరంకుశ విధానం,
                సర్దార్ అంకుశము!
48,సెప్టెంబర్ 17,
  ఆపరేషన్ పోల్,
      భారత సైన్యము,పివిఎల్!
3. ముట్టడి ,మహారాష్ట్ర,
 షోలాపూర్ భీకర యుద్ధము!
ఐదు రోజుల అనంతరం,
    నవాబు తలవంచడము!
సెప్టెంబర్ 17 సంస్థాన ,
         విలీన అంగీకారము!
భాగాలు ,మహారాష్ట్ర,
కర్ణాటకాలలో,విలీనం,పివిఎల్!
4. హైదరాబాద్ రాష్ట్ర,
       ఆవిర్భావము నిజము!
   ఆంధ్రాలో విలీనం,
    ఉమ్మడి రాజధాని నగరము!


   అదే రాజధాని ,2014,
     తెలంగాణ ఆవిర్భావము!
   నాటి ప్రజల పోరాటాలు,
         త్యాగాలు మరవము!
  తెలియుము,తెలంగాణా, 
      పోరాటాల,మాగాణము,
                               పివిఎల్!
_________

కామెంట్‌లు