స్వతంత్ర భారతం;-గీతారాణి అవధానుల (మయూఖ);-9491475210
ప్రక్రియ: సున్నితం
=============
ఎందరో వీరుల త్యాగఫలము..
నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యము..
మరువలేనిది పోరాట చరితము..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

పరదాస్యములో మగ్గిన భారతమాత..
చెరసాలలో బంధించిన క్రూరప్రభుత..
పోరాటవీరులను కన్న ధన్యచరిత..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

చేసిరి ఎన్నో ఉద్యమాలు..
అనుభవించిరి చెరసాలలో శిక్షలు..
తెంచిరి దాస్య శృంఖలాలు..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

సహాయ నిరాకరణ ఉద్యమం..
దండిలో ఉప్పు సత్యాగ్రహం..
తరిమికొట్టిన క్విటిండియా నినాదం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

జరుగుతున్నది స్వతంత్ర వజ్రోత్సవం..
త్రివర్ణపతాకానికి చేద్దాం వందనం..
అమరవీరులను మనసారా స్మరించుకుందాం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

కామెంట్‌లు