ప్రక్రియ పేరు :"సున్నితం "
=====================
తెలుగున నూత్నప్రక్రియ సున్నితము
రూపొందించెను మన సునీతమ్మ
నేడు ద్వితీయ వార్షికోత్సవము
చూడచక్కని తెలుగు సున్నితంబు
ప్రక్రియ నవనీతం కమనీయము
సాహిత్యాన ఇది మణిహారంబు
నూతన కవులకున్ ప్రోత్సాహంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు
నొక్క అంశంబే ప్రతివారంబు
సాగిపోవు కవితా ప్రవాహంబు
కడుచున్నారు ప్రతిభకున్ పట్టంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు
ప్రక్రియ సమీక్షకులు ముగురమ్మలు
యామిని భవానీ అహల్యగార్లు
సహన సౌశీల్యానికి జోహార్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు
సాగాలి "సున్నితం" సాహిత్యఝరి
దశ పుస్తకాలు విడుదలాయేను
సాహిత్య ప్రభంజనం "సున్నితం"
చూడచక్కని తెలుగు సున్నితంబు
&&&&&&&&&&&&&&&&&&&
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి