ఉపకరించు తత్త్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 ప్రభుత్వ యంత్రాంగంలో కానీ  మరి ఎవరైనా పెట్టిన  పరిశ్రమలలో కానీ పని చేసే వారిని ఉద్యోగులు అంటారు.  కానీ ఉద్యోగం అంటే అర్థం తిక్కన సోమయాజి చెప్పాడు  భారతంలో ఉద్యోగ పర్వము వుంది. పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు  ఆ వచ్చే సంవత్సరం ఎలా ఉండాలి?  ఎంత రహస్యంగా ఉండాలి?  మనం ఫలానా చోట ఉన్నామన్న విషయం తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి  అనేవన్నీ కూడా ఆలోచించుకోవాలి దానినే ప్రయత్నము అంటారు.  ఉద్యోగం చేసుకునేవాడు  ఇతరులకు సహకారిగా కూడా ఉండాలి. పాండవులు ఒకరింట్లో వుంటున్నారు.  వారింట్లో ఒక కష్టం వచ్చింది  భార్య భర్త కొడుకు కూతురు  వారిలో ఒకరు రాక్షసునికి ఆహారంగా వెళ్ళవలసి వచ్చింది  కుంతీదేవికి తన కుమారుడు భీముని బలం తెలుసు కనుక గృహస్థును పిలిచి మీరు ఎవరూ వెళ్ళనవసరం లేదు నా కుమారులు అయిదుగురు ఉన్నారు. ఒకరు వెళ్లి మీ తరఫున పాల్గొంటారు అని చెబుతోంది. ఆ గృహస్థు కుంతిదేవికి పాదాభివందనం చేసి తన సమస్యను తీర్చినందుకు  కృతజ్ఞతలు చెబుతాడు తరువాత ఆ రాక్షసుడ్ని చంపడం అనేది కథా భాగం. అలాగే ధనం ఉన్నవాడు  మంచి మనసు ఉన్న వాడు కూడా కావాలి.  అత్యవసర కాలంలో ఎవరికైనా  సహాయ పడవలసి వస్తే తన ధనాన్ని వాడవలసి వస్తుంది  మనుషుల లో ఎన్ని రకాలు ఉన్నారు అని అడిగిన ప్రశ్నకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెప్పింది  మంచి, చెడు అని అందరూ చెప్తా రండి  కానీ నా దృష్టిలో ఇవ్వాలని అనుకునేవాడు, అనుకోని వాడు  ఈ రెండే రకాలు  కనుక లేనివాడు ఎలాగో ఇవ్వలేడు ఉన్నవాడు  మంచి పనికి సహకరించకపోతే అతనిలో మానవత్వం ఉన్నట్లా, నశించినట్లా  మనిషికి మనిషి సాయం చేయ గలిగినవాడు సాయం చేయడం మనిషి ధర్మం అలా ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి లేకపోతే ఎందుకురా అంత డబ్బు ఉండి ఇంత పిసినారి తనం వచ్చింది రేపు చనిపోయిన తర్వాత అంతా పట్టుకు పోతావా లాంటి మాటలు వినవలసి వస్తుంది ఉన్న కుటుంబ సభ్యులకు. వేమన మరో కోణం కూడా చెబుతున్నాడు.  ఇన్ని ఉన్నా కౌశలం లేకపోతే వాడు ఎందుకూ పనికి రాని వాడు అవుతాడు. ఏ పని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అన్నది తెలుసుకుని  ఆ పని చేయాలి చేయకలిగిన పనికూడా చేయలేకపోతే, లేక మాట సహాయం చేయగలిగిన  మనిషి దానికి కూడా విముఖుడైతే  పరిస్థితి ఏమిటి? చేయవలసిన మంచి పని ఆగిపోతుంది కదా. అలాంటి స్థితిని తీసుకురావద్దు అని చెప్పడం కోసమే వేమన ఈ పద్యాన్ని రచించాడు. వారిని పరిపాలనాదక్షుడు అని కూడా అంటారు. మంచి మనసు కలిగితే మంచి పాలన వస్తుంది అన్నది చెప్పకనే చెబుతున్నారు వేమన. 

"ఉచిత వంతుడైననుద్యోగ పరుడైన 
సంపద మరియున్న  సమయముననే   
పరులకు ఉపకరించి పాలింపగల్గును..."


కామెంట్‌లు