స్వతంత్ర భారతం; - కె.కవిత- సెల్ 9493978287.
ప్రక్రియ: సున్నితం
===============
సులువుగా దక్కలేదు స్వతంత్రం
అదృష్టంలా తలుపు తట్టలేదు
అమరవీరుల త్యాగఫలం
స్వతంత్రం...
చూడచక్కని తెలుగు సున్నితంబు

 గాంధీజీ అహింస బాటలో
అల్లూరి విప్లవ పాటలో
వీరవనితల విజృంభణ పోరులో..
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రాణాలు  సైతం లెక్కచేయక
కష్టాలు  కన్నీళ్ళకు వెరయక
ఎన్నిఅడ్డంకులు ఎదురైన బెదరక...
చూడచక్కని తెలుగు సున్నితంబు

 కవులు  కలాలు కదిలించారు
విప్లవకారులు గళాలు ఎలుగెత్తారు
యువకులు  ఉరకలై కదంతొక్కారు..
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఏకధాటిపై నిలిచారు అందరు 
తెల్లదొరలకు  చూపించారు చుక్కలు..
పలాయనం  చిత్తగించేలా చేశారు...
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

కామెంట్‌లు