సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు: కె.కవిత-9493978287.
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
=============================
51.నూతన సమూహాన చేరాను
కుటుంబంలో సభ్యురాలు అయ్యాను
ప్రక్రియ అవగాహన చేసుకున్నాను
చూడచక్కని తెలుగు సున్నితంబు

52.తెలుగుభాష నూతన   ప్రక్రియకి
ఓహో అనిపించేను చదివినవారికి
సాహో  మా సునీతమ్మకి
చూడచక్కని తెలుగు సున్నితంబు

53.అందరికీ ప్రోత్సాహం ఇస్తారు
తెలుగుతల్లికి పట్టం కట్టారు..
జాతీయాన జెండా ఎగరేసారు...
చూడచక్కని తెలుగు సున్నితంబు

54. సమీక్షలు ఓపికగా చేస్తారు
తప్పులుంటే సున్నితంగా చెప్తారు
రాసేవారికి ఉత్సాహం ఇస్తారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

55. ద్వితీయ వార్షిక  వేడుకలు..
అంబరాన్ని అంటాలి సంబరాలు..
అందుకోవాలి ఎన్నో శిఖరాలు.....
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు