సన్నుతం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;- మేకల లింగమూర్తి--చరవాణి : 9573284788
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ : సున్నితం
రూపకర్త : శ్రీమతి నెలకుట్ల సునీత గారు
***  **  *****

సాహితీ బృందావన వేదిక
సాహిత్య కవుల గీతిక
సరళ పదముల పీఠిక
చూడ చక్కని తెలుగు సున్నితంబు

నూతన ప్రక్రియ సున్నితము
పొందెను అందరి అభిమానము
కవులకు ఎంతో ఆనందము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

సునీతమ్మ రూపొందించిన సున్నితము
ప్రక్రియలలో కెల్ల అద్భుతము
మరువలేని తీపి మకుటము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

వారానికో అంశం ప్రకటన
ద్వితీయ వార్షికోత్సవ శుభదినమున
అందుకో అందరి అభినందన
చూడ చక్కని తెలుగు సున్నితంబు

బహు చక్కని సమీక్షలు
కవులకు ఎన్నో పొగడ్తలు
అందించారు గొప్ప పురస్కారాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

కామెంట్‌లు