నేత్రపర్వం; -డా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం-9866203795
 అర్ధరాత్రి ని సూచిస్తూ చర్చి గంట పన్నెండుకొట్టింది.లోకమంతా చీకటి దుప్పటి కప్పుకుంది.
కమ్ముకున్న చీకటి మిణుకు‌మిణుకు మంటున్న నక్షత్రాలను మబ్బులు కమ్మేస్తున్నాయి.చీకటి‌నేలను చల్లగాలి కమ్మేస్తుంది.రాబోయే కష్టానికి గుర్తుగా కాలం కంటి నీరు చుక్కల్లా పడుతున్నాయి.వీస్తున్న వర్షపు గాలి కురుస్తున్న వాన చీకటిరాత్రి  ఏదో జరగబోయే ఉదృతానికి సంకేతం అయింది.నిశ్శబ్దంగా ఉన్న ఆరాత్రి ఏకాంతాన్ని భంగం చేస్తూ ఒక నల్లటి కారు‌నిశ్ధబ్దంగా‌ వచ్చి ఆగింది.అందులోంచి ఖరీదైన చెప్పులతో రెండు పాదాలు కాలు‌కిందపెట్టాయి.ఖరీదైన చీర.మెడలో నగలు.చూస్తే పెద్దింటి అమ్మాయి లాగా కనిపిస్తుంది. ఆమెముఖం లో భయాందోళన. కళ్ళలో కంగారు.చేతిలో ఏదో వస్తువును‌పొదివి పట్టుకుంది అపురూపమైన వయ ఆస్థిలాగా.నడుపుకుంటూ వచ్చిన ‌కారు‌రోడ్డు‌పక్కన ఆపిన నెమ్మదిగా ‌దిగి చీకటిలో నెమ్మదిగా అటూ ఇటూ చూస్తూ భయం భయంగా అడుగులేసింది
ఆ అడుగులు అనాధాశ్రమం ముంద ఆగాయి.నెమ్మదిగా ‌తలముసుగు పైకిలాక్కుని నలుదిక్కులా ‌చూసింది.అలికిడిని చెవులు రిక్కించి విన్నది.నెమ్మదిగా ‌తన చేతిలోని మూటను ఒక్కసారి గుండెలకత్తుకుని  వస్తున్న కన్నీటిని పంటితో నొక్కిపట్టి అక్కడ ఉన్న స్థంబం పక్కన పెట్టింది.ధడాలున ఇవతలికి‌వచ్చింది.ఆఅర్ధరాత్రి నిశ్శబ్ధాన్ని  చీలుస్తూ బిడ్డ ఏడుపు కేక ఒక్కసారిగా‌నిశ్శబ్దాన్ని పారద్రొలింది.వెళ్ళలేక వెల్తున్న అడుగులు‌మరలా ఒక్క ఉదుటున బిడ్డ దగ్గరకు పరిగెత్తింది. ఒక్కసారి గుండెలకత్తుకున్న ఆమె‌చెంపలపై కన్నీటి ప్రవాహం చీకట్లో తళుక్కుమంది.మరలాభారంగా బిడ్డను దించుతుండగా ఆశ్రమం తలుపు తెరుచుకుంది.ఒక మనిషి ఆవలిస్తూ బయటకు‌వచ్చాడు అతన్ని‌చూసి స్థంబం చాటున నక్కింది.వచ్చిన అతను బిడ్డను పొదివి పట్టుకుని ఎవరూ అంటూ ముందుకు‌వచ్చి ముఖం చూసి అమ్మాయిగారూ మీరా.ఇక్కడా...అన్నాడు ఆశ్చర్యకరంగా.
సమాధానం లేకపొయ్యేసరికి ఈబిడ్డ..అంటూ అనుమానంగా ...ఇంట్లో ఇచ్చిన స్వేచ్చా. ఎక్కువైన డబ్బు వళ్ళుమదం నా ఈ పరిస్థితి కి కారణం.నా పాపానికి ప్రతిఫలం ఈబిడ్డ.రేపు నాభవిష్యత్తుకు అడ్డం రాకూడదని ఇలా.మీకు డబ్బు ఎంతకావాలంటే అంతిస్తాను.ఈవిషయం బయటకు రాకుండా ...అంటూ చేతులెత్తి నమస్కరించింది.
కాలపు రైలు పరిగెత్తూనే ఉంది .అందరూ రెడీ అయ్యారా కాలేజికి .ఏరా స్కూలుకు వెళ్ళే‌వాళ్ళని దింపి మీరు‌వెళ్లండి అంటూ అందర్ని పిలవసాగాడు సుందరం.ఆయన‌మాటలు‌విన్న పిల్లలందరూ అలాగే‌బాబా అంటూ కదిలారు‌వాళ్ళని‌చూస్తూ ఉన్న అతనికి‌బాబా అన్న పిలుపు‌వినబడి వెనక్కి తిరిగి చూసిన అతనికి కర్రతో తముడుకుంటూ వస్తున్న నవీన్ చూసి నవీన్‌ఇవ్వాళ ప్రోగ్రామ్ ఉందా అన్నాడు .అవును‌బాబా ఇవ్వాళ పాటల పోటీ ఫైనల్స్ గెలిస్తే లక్షరూపాయల బహుమతి ఆడబ్బులతో ఆశ్రమాన్ని ‌ఇంకా అభివృద్ధి ‌చెయ్యవచ్చు.కళ్ళులేక పోయినా‌కమ్మగా పాడి నీపాటలతో సంపాదించిన డబ్బులతో ఆశ్రమాన్ని ఆదుకొంటున్నావు
ఆమె కన్నీటి ఆంతర్యాన్ని గ్రహించి తిరుగు నమస్కరించి చేశాడు సుందరం.చూడుఈపదిలక్షలు తీసుకో ఈబిడ్డకు తల్లి నేను అన్న విషయం చెప్పకు  చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలనే‌నా ప్రయత్నంలో నాకు  చేయీతనివ్వు.త్వరలో నేను ఈఊరు వదలి వెల్తున్నా.నాకు పోనుచెయ్యద్దు నేనేవీలును‌బట్టిసాయం చేసి స్తాను.ఈవిషయం ఎవరితో అనకు పదిమందికి ఉపయోగపడాలని మాపెద్దలు కట్టించిన ఈ అనాధాశ్రమం నాబిడ్డకు ఉపయోగిస్తుంది కదూ అంటూ ఏడ్చిన ఆమెను ఓదార్చటం అతని తరం కాలేదు.ఏడవనిచ్చాడు కురుస్తున్న వర్షం తెరపిచ్చినట్లు అమెకన్నీటివర్షం ఆగిందాకా ఆగాడు.తెల్లవారవచ్చే టైం అయింది నేను వస్తాను అంది ఊపిరి‌బిగపట్టుకుని..మౌనంగా తల ఆడించాడు.ఒక్క అడుగువేసింది .మరలా‌వెనక్కి‌వచ్చి‌బిడ్డను‌గుండెకత్తుకుంది.ఆమె‌చెతిలోంచి‌బిడ్డను తీసుకుని దూరంలో ఉన్న కారు‌వైపు‌చెయ్యి చూపించాడు.చీకట్లో కలిసిపోతున్న ఆమె తిరిగి ఎక్కడ‌వస్తుందోనని బడ్డను పొదివి పట్టకుని లోపలికి నడిచాడు లైటు ఆపి ఆమె గతాన్ని జరిగిన విషయాన్ని‌చీకటికి వదిలేసి.చీకటిలో సాక్షీ భూతంగా చూస్తూ కన్నీటిని‌బిగపట్టుకుని కారు డ్రైవు‌చేసుకుంటూ సాగిపోయింది అభినవ కుంతి......
మాట మారుస్తూ ఇవ్వాళ ప్రోగ్రామ్ ఎక్కడ...అన్న సుందరం మాటలకు ఇవ్వాళ ఈటివిలో‌బాబా‌అమ్మ మీద పాడాలి.అమ్మ అంటే ఎరుగని‌నేను అమ్మ పాట ఎలా‌పాడేది.అన్నాడు బాధగా.వెన్నెల గురించి ప్రకృతి గురించి పాడుతున్నావు తెలిసేనా. అన్నాడు‌మాటకు‌అడ్డు‌వస్తూ చెబుతారా నిన్ను అక్కడ‌బండి‌మీద‌దింపి వెల్తా.పద అంటూ చెయ్యి పట్టుకు‌నడిపించాడు
రేపు నీవెళ్ళి పోతే ఎలా‌నవీన్‌అన్నాడు బాధగా.నేనెక్కడకు పోతాను బాబా పుట్టుకతో గుడ్డివాడ్ని అని‌కన్నతల్లి‌వదిలేసి పోతే నన్ను ఆదరించి‌చదివించినాకిష్టమైన సంగీతాన్ని నేర్పించి నన్ను‌ఒక గాయకుడుగా  నిలబెట్టి పేరు ప్రతిష్టలు తెచ్చి‌పెట్టారు నావెనుక కొండంత అండ‌మీరున్నారు అన్న ధైర్యంనన్ను నడిపిస్తుంది.అన్న నవీన్ మాటలకు గద్గగస్వరంతో భగవంతుడు నీకు‌చక్కని రూపం ఇచ్చి కళ్ళు లేకుండా ‌చేశాడే అన్న బాధ‌లేకుండా కమ్మడి స్వరం ఇచ్చిన్యాయమే‌చేశాడు.
నవీన్ ను దింపి బయలు దేరిన సుందరం సిగ్నల్‌దగ్గర ఆగాడు
గుర్తు తెలియని‌ఒక స్ర్తీ‌బాబు‌ధర్మం చెయ్యండి‌బాబూ అంటూ అడిగిన మాటకు ఇటు తిరిగాడు.
 ఏమిటీ నా‌బాబు గాయకుడుగా పేరు ప్రతిష్టలు‌సంపాదిస్తున్నాడా.అంతెత్తుకు‌ఎదిగాడా.నా‌దౌర్బాగ్యపు జీవితానికి అంత అదృష్టమా‌బాబూ.బాబూ నాబిడ్డ నన్నెప్పుడన్నా అడిగాడా.అని ఆతృతగా‌అడిగింది‌తల్లి.దానికి‌సుందరం మౌనపు‌దుప్పటిలో తలదాచుకున్నాడు.ఏం బాబూ‌మాట్లాడావు.ఏం మాట్లాడేదమ్మా చేసిన తప్పును‌ఏటి పాలు‌చేసిన ఆఆడదానికినీకు పెద్దగా తేడాలేదమ్మా ఆమె‌ఏటిలో‌పారేసింది.నువ్వేమో‌అనాధాశ్రమంలో పారేశావు.అంతేతేడా  కోపంగా అన్బాడు.
బాబూ అంది‌ఏడుస్తూ
నీలాంటి‌తల్లి‌ఒకటుందని వాడికి తెలియదు.వాడి అదృష్టమో‌నీ‌దౌర్బాగ్యమో కాని తల్లి‌చల్లని‌చూపులేని ఆబిడ్డకి‌కంటి‌చూపు లేకుండా‌చేశాడా‌భగవంతుడు
ఏందినాబిడ్డ‌గుడ్డివాడా.నా పాపానికి‌వాడుఫలితం అనుభవిస్తున్నాడా
.అయ్యో‌ఎం త దౌర్బాగ్యురాలిని‌.ఒక్కసారి‌వాడ్ని‌దూరంగా‌ఉండి‌చూస్తాను.మీతో తీసుకెల్తారా.అని ప్రాధేయపడి అడిగింది.చివరకు‌మెత్తబడి రమ్మన్నాడు.చివరకు ఆమెకన…
బాబా అమ్మ ఏంటే‌ఏంటిబాబా అమ్మ‌ప్రేమ ఎలా ఉంటుంది ‌బాబా అనినవీన్‌అడిగి సుందరం సమాధానం చెప్పేలోపే‌ఆమె.బిడ్డను‌తమిడింది.ఆస్పర్శ‌అతనికి కొత్తగా.వింతగా ఉంది.ఏంది‌బాబా‌వెచ్చని‌వేసవిలో చల్లని గాలులు‌వీచినట్లు ఎడారిలో‌మంచు‌వెన్నెల కురిసిమట్లు.మూగబోయిన వీణ రాగాలు వినిపించినట్లు ఎంతహాయిగా ఉంది‌బాబా అమ్మ స్పర్శ.ఎవరు‌బాబా‌ఈ‌చల్లని‌హస్తం గల‌స్ర్తీమూర్తి
సుందరం నోరు‌విప్పేలోపే‌నమస్కరం చెయ్యటం తో మౌనాన్ని‌ ఆశ్రయచక తప్ప లేదు‌బాబాకి
సర్దుకుని‌అదే.బాబు అమ్మ స్పర్శ‌ంటే..అలాగా అమ్మ‌స్పర్శ‌ఇలాఉంటే‌అమ్మ ఎలా ఉంటదో అని‌నవీన్‌అంటుంటే‌అక్కడ‌నిలవలేక‌బయటకు పరిగెత్తింది.అమెననుసరించాడు‌ సుందరం.
ఏందమ్మా‌అలా.వచ్చావు
అన్న ప్రశ్నకు సమాధానంగా కళ్లులేని‌నాబిడ్డముందు‌దోషిగా‌నిలబడలేను.అందుకే అబిడ్డకు‌కళ్ళు తెప్పించి‌ఆతర్వాత వాడికి కనిపిస్తా.వాడు అసహ్యించుకున్నా ఏమిచేసినా.
నీప్రతిజ్ఞ బాగుందమ్మా కాని‌కళ్ళు‌....అన్న అతనికి సమాధానంగా ఇన్నాళ్ళు‌నాపొట్టకోసం అడుక్కున్నా ఇక నాబిడ్డకళ్ళ‌కోసం అడుక్కుంటా నాకు తెలిసిన డాక్టర్లను‌కలిసి ఎక్కడా‌చిక్కక పోతే నాకళ్ళే.నాబిడ్డకిస్తా అన్నది ఆవేశంగా
ఆఅడుక్కుతినే ఆడమనిషి‌ముఖం ఆ‌గొంతు‌ఎవర్నో లీలగా స్తుతి స్తుంటే పరిశీలనగా చూశాడు.ఈలోపల సిగ్నల్ రిలీజు అయింది.సిగ్నల్ దాటి ఇవతలకి‌వచ్చి బండి పక్కకి ఆపి‌వెనక్కి‌వచ్చి ఆమెను‌వెతికి పట్టుకుని రోడ్డుదాటించి పక్కనే‌ఉన్న హూటల్ లో టిఫిన్‌పెట్టించి వివరం అడిగాడు.ఆమెకు‌తనెవరో గుర్తుచేశాడు
ఈపరిస్థితికి కారణం అడగగా కామంతో కళ్ళు‌మూసుకుపోయి బిడ్డకు ద్రోహం చేసినందుకు ఆ
కట్టుకున్నవాడు దురలవాట్లతో అయిన వాళ్ళ మోసంతో ఆస్థి హారతి కర్పూరం అయింది.అప్పులవాళ్ళు ఉన్న ఆస్తి అంతా‌లాక్కుని గెంటేశారు
బిడ్డకు చేసి న ద్రోహం కారు చిచ్చు ఐ నన్ను కాల్చుకుతింటున్నది ఇలా అడుక్కు తినేలా‌చేసింది
ఇక నాసంగతి ఎందుకులే  ఆఖరి క్షణాన ఉన్నా.నాబిడ్డ ఎలా ఉన్నాడు.అని అడిగింది ఆతృతగా మౌనంగా‌లేస్తూ వందరూపాయలు‌చేతిలో పెట్టాడు.బాబూ నాక్కావాల్సింది ఆకలి తీర్చే డబ్బు‌కాదు.నా.బిడ్డగురించిన సమాచారం.చెప్పు బాబూ అంటూ కాళ్ళ‌మీద పడింది ఆతల్లి ఆత్రం గమనించి తల్లిగా నీవు ద్రోహం చేసి సినా భగవంతుడు‌చిన్న‌చూపు‌చూసినా నీ‌బిడ్డ ఎవరికీ అందనంత‌ఎత్తుకు ఎదిగాడు.స్వయం కృషితో పట్టభద్రుడయ్యాడు.సంగీతంలో అపారమైన అను భవం సాధించి అద్వితీయమైన ‌గాయకుడుగా మారాడు.ఆచెప్పటంలో గర్వం తొంగి చూసింది. జన్మనిచ్చిన తల్లిని చూసాను.బిడ్డకోసం కళ్ళను దానమిచ్చే‌తల్లి ఉండటం చాలా‌అరుదు.బాబా నేను కళ్ళు ఇచ్చేవిషయం వాడికి తెలియనివ్వకండి..అని అతని‌సమాధానానికి ఎదురు‌చూడకుండా వెళ్ళి పోయింది ఆమె.........
➖➖➖➖➖➖➖
డాక్టర్ ఏమంటున్నారు డాక్టర్‌..నాకళ్ళునాబిడ్డకు పనికిరావా అన్న ఆమె ఆందోళనల ప్రశ్నకు అవునమ్మా నీకళ్ళకు పొరవచ్చింది. అది నీబిడ్డకుమాత్రమే కాదు ఎవరికి పనికి రావు...అన్న డాక్టరు‌మాటలకు దిగ్బ్రాంతి‌చెంది నాబిడ్డకు చూపు‌వచ్చేదెలా డాక్టర్ అంటూ ఏడ్చింది.చూడమ్మా ఏకళ్ళు‌అంటే అవి పెట్టకూడదు.ఎవరివైనా‌నేత్రదానం చేసిన వాళ్ళు ఉంటే అవి పెట్టవచ్చు.నేను‌జీవితపు‌చివరి అంచులో ఉన్నాను నాబిడ్డకోసం తిరిగికళ్ళు తెచ్చేదెవరు.ఎవరిస్తారు డాక్టర్.నిజమేనమ్మా నేత్రదానం ఆవశ్యకత‌తెలీని‌మనదేశంలో ఎవరూ ముందుకు రావటం లేదు.తాము పోయినా తమ కళ్ళు లోకాన్ని‌చూస్తాయన్న ఆలోచన లేని ఈమనుషులకు ఎలా‌చెబితే‌అర్ధం అవుతుందో అర్ధం కదా.శరీరంలో పూర్తి అవయవాలు లేకుండా దహనం చేస్తే వాళ్ళునరకానికి పోతారు అన్న హిందూ చాదస్థపు అలలలో ఈజనం కొట్టుకు పోతున్నంతకాలం ఇంతే‌ఈ‌జనం మారరు.తామునశించినా తమ అవయాలు‌బ్రతికే‌ఉంటాయన్న గర్వంతో ఈదేశ‌ప్రజలు‌ఎప్పుడు తలెత్తుకు‌తిరుగుతారో అని‌ఎదురు‌చూస్తున్నానమ్మా.విదేశాలలో అవవయదానం చేసే‌వారి‌సంఖ్య‌నలభై‌ఏడు‌శాతం ఉంటే మనదేశంలో అతి తక్కువగా ఉంది.ఏప్రభుత్వాలు‌కూడా‌దీన్ని‌సరిగా‌ఎందుకు ప్రోత్సహించడం లేదో అర్ధం కాదు.అన్న డాక్టరు‌మాటలకు అడ్డు‌చెబుతూసార్ నాకిడ్ని అమ్మి‌నా బిడ్డకుకంటి‌చూపు తెప్పించండి సార్ అంటూబ్రతిమ లాడే ఆతల్లిని‌చూస్తూ అలాగే ఉండి పోయాడు డాక్టర్.
➖➖➖➖➖➖➖

కామెంట్‌లు