నాదే ఈ తెలంగాణ ( తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా ) ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ )ఫోన్ నం.9949267638
భారత స్వాతంత్య్రంతో
పెచ్చుమీరే నిజాము
తానే స్వతంత్రుడనని
హైదరాబాద్ సంస్థానం 
నాదే నని ప్రకటించుకునే

నిజాము ఆరాచకత్వాలు
ఊరూర విజ్రుంభించే
ఆడవాళ్ళతో నగ్నంగా
బతుకమ్మలు ఆడించిరి
రజాకార్ల రాక్షసులతో రాజ్యం 
అతలాకుతలం ఐపోయే

తెలంగాణలో ఉద్యమం
ఉవ్వెత్తున పెరిగి పోయే
ఇంటికొక్కడు బడితే పట్టి
రజాకార్ల దునుమాడిరి
నిజాం నిరంకుశాన్ని నిలదీసి పాతేసిరి 

మా భూమి మా రాజ్యం
మా నీళ్లు మా అడవీ
మాకిచ్చేదాకా మేమొదలం
ప్రాణాలు తెగించి పోరాడుతాం

పోరాట యోధులతో
ఉడికిపోయే తెలంగాణ
స్వాతంత్ర్య సమర యోధులతో
ఊగిపోయే తెలంగాణ

నిజాం గుండెల్లో రైళ్లు
పరుగెత్త వట్టే
ముచ్చేమట పట్టి మూడు చెర్ల నీళ్లు తాగే

సర్దార్ వల్లభాయ్ పోలీస్
ఆపరేషన్ తో
నిజాం లొంగిపోయే
సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచనమాయే

తెలంగాణ ప్రజలైన మనము
తెలంగాణ పోరాట యోధులకు
స్వాతంత్ర్య సమర యోధులకు
తెలంగాణ విముక్తి కోసం పోరాడి
అసువులు బాసిన అమర వీరులకు
నివాళులు అర్పిద్దాం వారిని స్మరిద్దాం జోహార్ జోహార్ 
🌹🌹🌹

కామెంట్‌లు