స్వతంత్ర భారతం;-డా. సూర్యదేవర రాధారాణి;-సెల్ ; 9959218880
ప్రక్రియ: సున్నితం
===============
ముప్పాతిక  సంవత్సరాల  క్రితము 
పోరాడి తెచ్చుకున్న స్వతంత్రము 
స్వేచ్ఛగా  చేసుకుంటున్నాం వజ్రోత్సవము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

పడ్డాము ఇబ్బందులు చాన్నాళ్ళు 
భరించలేని బానిసత్వపు సంకెళ్ళు 
తరిమికొట్టాం బిగించి పిడికిళ్ళు 
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !

వేశాము కలిసికట్టుగా అడుగులు 
మరచిపోయి   కులమతలింగ బేధాలు 
సహనం సత్యాగ్రహం ఉద్యమాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఎందరో అర్పించారు ప్రాణాలు 
మరెందరో కోల్పోయె మానాలు 
అయినా వెన్నుచూపని ధీరులు
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !

స్వతంత్రభారతంలో ఉందా అభివృద్ధి?
పెరిగింది అవినీతి సమృద్ధి 
ఇకనైనా  తెచ్చుకోవాలి బుద్ధి 
చూడచక్కని తెలుగు సున్నితంబు !!

కామెంట్‌లు