మనకీర్తి శిఖరాలు ;-కపిలవాయి లింగమూర్తి . .;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 కపిలవాయి లింగమూర్తి .  (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.
వీరు అచ్చంపేట తాలుకా, బల్మూర్ మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగాడు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు. పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. 1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్ లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడే స్థిరపడ్డారు. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 127 రచనలు (పరిష్కతాలు,సంకాలనాలు,సంపాదితాలు కలిపి) ముద్రితమయినవి.16 రచనలు ద్వితీయ ముద్రీతాలు.ఇంకా 30 రచనలు ముద్రణ కావల్సి ఉంది.
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ కవులు, సాహితీ వేత్తలకు అన్యాయం జరిగింది. జీవోలు తెలుగులో రావాలి. పాఠశాలల్లో తెలుగు బోధించాలి
రచనలు.
ఇతడు శతాధిక రచనలు చేశాడు. ఇతడు వెలువరించిన గ్రంథాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ముద్రితాలు.స్వీయరచనలు.
ఆర్యా శతకం
ఆంధ్ర పుర్ణాచార్యుడు
ఉగాది ప్రబంధం
ఉదాహరణ పురుషుడు
ఉప్పునూతల కథ
ఉమామహేశ్వరం స్థలచరిత్ర - స్థానిక వృత్తాంతాలు
ఉమామహేశ్వరం హరికథ
కంకణగ్రహణం
కపిలవాయి గేయఖండికలు
కపిలవాయి లింగమూర్తి కథానికలు
కపిలవాయి లింగమూర్తి కావ్యాలు
కపిలవాయి పీఠికలు
కుటుంబగీత
క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర
గద్వాల హనుమద్వచనాలు
గురుగోవిందమాంబ చరిత్ర
గీతాచతుష్పథం
గోదాదేవి కథ
చంద్రగుండ మఠం చరిత్ర
చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం
జినుకుంట రామబంటు శతకం
తెల్లరాళ్ళపల్లి తిరుమలేశ శతకం
దుర్గాభర్గ శతకం
దేవుడు జీవుడు
నాగమణి
నాగరకందనూలు కథ
నిదర్శనాలు
పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు
పద్యకథా పరిమళము
పాలమూరు జిల్లా దేవాలయాలు - 2010
ప్రబోధపటహం
బావుచ్చి
భాగవత కథాతత్త్వం
మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర
మూడుతరాల ముచ్చట
నమో పంచాయనాన నమః
పద్యపేటిక
రాజరథం
విశ్వకర్మ పురాణము
విశ్వబ్రాహ్మణులు సంస్కృతీ అనుకరణం (కన్నడ నుండి అనువాదం)
వివాహస్వర్ణోత్సవ సద్దలి
శ్రీ ఇందేశ్వర చరిత్ర
శ్రీనారాయణదాసు రామాచార్యుల వంశచరిత్ర
శ్రీనివాసవైజయంతీ కళ్యాణోదాహరణం
శ్రీ భైరవకోనక్షేత్ర మాహాత్మ్యం
శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ఆరు ఆశ్వాసాల స్థల చారిత్రక కావ్యం
శ్రీమదానందాద్రి పురాణం
శ్రీలక్ష్మీపుర నరసింహ భజనకీర్తనలు
శ్రీ శివరామబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
సహమానశతకం
సాయిత్రయి
సాయిశతకద్వయం
సాలగ్రామం (ఆత్మకథ)
సుందరీ సందేశం
సుబ్రహ్మణ్యోదాహరణం
సోమశిల దేవాలయాల చరిత్ర
సోమశిల దేవాలయాల చరిత్ర శాసనాలు, సోమేశ్వరక్షేత్ర మాహాత్మ్యం
సోమేశ్వర క్షేత్ర మాహాత్మ్యం
బిరుదులుసవరించు
1992లో కవితా తపస్వి
1992లో కవితా కళానిధి
1992లో పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2008లో సాహితీ విరాణ్మూర్తి 
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి
సన్మానాలుసవరించు
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందినారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.
కపిలవాయిపై డాక్యుమెంటరీ.
వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.కామెంట్‌లు