బ్రతకంత ఆనందం (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అల్లరల్లరి చేస్తూ ఓ బాబు
అలజడి చేయకు మా బాబు

కలహాలసలు వద్దురా బాబు
కలసి మెలసి ఉండురా బాబు

ఇంటిలో అమ్మా నాన్నమాటలు
బడిలో గురువుల బోధ విను బాబు

మిత్రులతో చేయి కలుపు బాబు
మంచి స్నేహితున్నెంచుకో బాబు

ఫోనులో ఆటలు వద్దు బాబు
బడిలో పాఠాలు ముద్దు బాబు

చెడుకెపుడు దరిచేర బోకు బాబు
మంచినేమొ నొదలబోకు మా బాబు

సత్యధర్మ మందు నీవు సాగుతూ
విద్యలో విజయము నొంది ఓ బాబు

నీవుముందు ముందుకెళ్ళిపోతే
బ్రతుకంతా ఆనందమే మా బాబు


కామెంట్‌లు