ఉడుత ;- ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
============
జామచెట్టుపై అందాల ఉడుత 
కొరుకుతుందిలే దోరకాయంత
ముందుకాళ్ళతో పట్టుకొనంత 
పటపటానమిలే  గింజలనంత 
తినడం ముచ్చటగొల్పునే సుంత.ఉమా!

చెంగునగెంతే గోడలమీదా 
అటుఇటు బెదిరే నవ్వది రాదా? 
దగ్గరికి వెళ్ళాలి ఇక పారిపోదా 
ఉడతఊపులు కొందరివి కాదా 
గింజలువేద్దాం ఆకలిబాధ... ఉమా!

చిన్ని ఉడతలో ఎంతో మేథా 
సాయం చేసే రామాయణం గాథా 
ఇసుకను రాల్చే వారథిమీదా 
ప్రేమగనిమిరే రాముని గాథా 
చారలు నిలిచేశాశ్వతమే కథా..ఉమా!

కామెంట్‌లు