"పుట్టినరోజు'' (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
రాము పుట్టినరోజుంట 
పండుగ రోజే ఆ ఇంట
 పలక బలపం చూసేనంట
బొమ్మల బుక్కు పట్టేనంట

 పలకను తెచ్చె మామంట 
బలపం ఇచ్చే అత్తంట
బ్యాగును తెచ్చే తాతంట
లడ్డులు తెచ్చే నానమ్మంట

 కొత్త బట్టలు తెచ్చె నాన్నంట
 తీపి వంటలు చేసె అమ్మంట
 ముద్దు పల్కులతొ అన్నంట
ముద్దులు పెట్టే అక్కంట

కామెంట్‌లు