గెలుపు ఓటమిల సమ్మేళనం జీవితం ఆట
ఆట బాగుంటుంది బ్రతుకే బ్రతకలేక
పరిహస మౌతుంది
ప్రేమాభిమానాలు అంగడిలో విన్యాసాలు
వేతుక్కో విలువలు దొరికే చోటు కోసం
నిజం తెలుసు ,కానీ నిలువదు
అబద్ధం, ఎంత తియ్యన అనుకూలం
మానవుని భావన ,మనసు మారనప్పుడు
ఏం చేయగలం, ఏడుస్తోంది హృదయం,
లాలి పాడి జాలీ చూపుతావా?
దౌర్భాగ్యానికి దాపువవుతావా?
చిత్తడి బ్రతుకుల సొంపులలో.
వెతుకులాట వ్యర్థం కదా
ఊపిరి వున్నంత వరకూ
వెతుక్కో ఉన్నత భావాల,అత్యున్నత
మనస్సులు,
పొందాలి సన్మానాలు, దాచు కోవాలి
వాటి గొప్పదనం .
అసరపై భరోసా వద్దు, నీ దైర్యం,
నీకు విజయం, ఎప్పుడే సాధిస్తావు
ఘన విజయాలు
పనికి రాని ఆలోచనలు నీకు వద్దు
చేయగలిగితే మంచిచేయి
లేదా నిన్ను. నీవు మరచిపో
కొప్పరపు తాయారు
17/462,B3, N.V.R. street
Nehru nagar
మదనపల్లి,(అన్నమయ్య,జిల్లా)
Pin.517325
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి