పాప ;-డా.గౌరవరాజు సతీష్ కుమార్

 మాపాప అడుగిడితే 
మేఘం జతకడుతుంది 
మాపాప పరుగిడితే 
గాలి జతపడుతుంది 
మాపాప మాటాడితే 
శబ్దం బలపడుతుంది 
మాపాప ఆటాడితే 
మౌనం పగులుతుంది 
మాపాప పాడితే 
రాగం కేలు మోడుస్తుంది 
మాపాప నవ్వితే
కౌముది వెల్లివిరుస్తుంది !!

కామెంట్‌లు