ఆంగ్ల సాహితీ వేత్తలు!ఎ.రాజ్యశ్రీ
 ఎర్నెస్ట్ హెమింగ్వే తండ్రి డాక్టర్.తల్లి గ్రేస్ పాటలుపాడేది.చక్కగా చిత్రాలు గీసేది.ఆమెదే పెత్తనం కావటంతో ఎర్నెస్ట్ కి కొన్ని ఏళ్ల పాటు ఆడపిల్లల దుస్తులు వేసేది.తమాషా ఏంటంటే అప్పటికే ఆమెకి నల్గురు ఆడపిల్లలున్నారు.మరిపాపం ఆపిల్లాడి కి అక్కల డ్రెస్సులు వేయటంలో అంతరార్ధం డబ్బు దండగ ఎందుకు అనేమో!అందుకేనేమో 15వ ఏట ఇంట్లోంచి పారిపోయాడు ఆకుర్రాడు.మొదటి ప్రపంచయుద్ధంలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేశాడు.ఐరోపా విలేకరిగా నవలా రచయితగా పులిట్జర్  నోబెల్ బహుమతి పొందాడు. బాక్సర్ గా యుద్ధవిలేఖరిగా సైనికుడిగా1940లో సినీ నటులకన్నా ఇతని ఫోటోలు జనాల్ని వెర్రెత్తించాయి!1960లోఅతని భూమి ని  ప్రభుత్వం స్వాధీనం చేసుకోటంతో దిగులు నిరాశతో రచనలు మానేసి ఇంట్లో తుపాకీతో  ఆత్మ హత్య చేసుకున్నాడు. 
ప్రసిద్ధ ఆంగ్ల కవి పెర్సీషెల్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుతూ వ్యతిరేక భావాలు  ప్రచారం చేసి బహిష్కరింపబడ్డాడు.ధైర్యం గా  పాంప్లెట్స్ కాలేజీలు బిషప్ లకు పంపేవాడు.తండ్రి "ఇలాంటి రాతలు మాని చదువుకోరా!"అని బతిమలాడినా "కుటుంబశాంతి కంటే నా అభిప్రాయాలు ముఖ్యం!" అన్నాడు. అప్పులు చేసి తిప్పలు పెట్టిన మారాజు షెల్లీ! ఇంటిపనిమనిషి రజకుల దగ్గర  డబ్బు తీసుకుని తలవంపులు తెచ్చాడు.మొండి బండగాడు!తుఫాను లో బోటులో పయనిస్తూ  మునిగిపోయినా గొప్ప ప్రకృతి కవిగా మిగిలాడు!
మేరీ ఉల్ స్టోన్ క్రాఫ్ట్  స్త్రీల హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ రచయిత్రి! ఎన్నో పిల్లల కథలు రాసింది.నాన్న తప్ప తాగి అమ్మ పై దౌర్జన్యాలు చేస్తుంటే పాపం  ఈచిన్నారి వారి గదిముందు పడుకునేది బైట బిక్కుబిక్కుమంటూ! అమ్మ ఏమైపోతుందో అని భయం! రచనలు చేసినా  బాల్యపు చీకటి ఆమెలో ఓవిధమైన నిర్వేదం నింపి  ఆత్మహత్య ప్రయత్నాలు చేసేది. 
వర్జీనియా ఉల్ఫ్ బాల్యం లోనే కలం చేతపట్టింది.తన30వ ఏట తొలి నవలతో మెరిసింది. ఆపై ప్రతి రెండు ఏళ్ల కోసారి నవలలు రాసి బెస్ట్ సెల్లర్ నావలిస్ట్ గా ఖ్యాతి గాంచింది.మానసిక ఒత్తిడి తో తన డ్రెస్సుకున్న జేబులనిండా రాళ్లు నింపి "అవుస్"అనే నదిలో తన59వ ఏట మునిగి చనిపోయింది. నిజంగా మన భారతీయ రచయితలు అదృష్టవంతులు కదూ🌷

కామెంట్‌లు