పద్య సూరీడు జాషువా;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
పద్యాల కొలనులో
పారిజాత  పుష్పము
"గుఱ్ఱం జాషువా" ది
నిలువెత్తు రూపము

వర్ధమాన కవులకు
వెలుగులీను దీపము
అవమానాల వేళ
చూపించెను సహనము

అల్పబుద్ధి జనులకు
గుణపాఠం చెప్పెను
సాహితీ పొలంలో
పద్యాలు పండించెను

పద్యాన్ని బ్రతికించిన
జాషువాకు జేజేలు
జీవితమర్పించిన
పద్య రాజుకు జేజేలు


కామెంట్‌లు