ఈ భువినే... దివిగా మార్చే...
చైతన్య శ్రామిక మార్తాoడు లు వీరు.... !
చీకట్లనువిదిలించి,వేకువతోనే
తట్టా,బుట్టా,పలుగు,పారలు
వారి దివ్యశస్త్రాస్త్రాలతోబయ లుదేరి...చిందించిన చెమట చు క్కలే అత్తరైపరిమళించునటుల
వికారాలకు అపురూపఅందాల
నిస్తూ... సుఖ, ఆనందాలను ఈ ప్రపంచానికి పంచిపెడుతూ
కూలిడబ్బులకష్టంపొయ్యి మీదికి సమకూర్చిందన్న ఆనం దంతో... పొయ్యి కిందికి ఎండు పుల్లలను ఏరి...తట్టలలో సర్దు కుని, అల్పసంతోషపు సంతృప్తి
తో... ఆనందంగా, ఇంటిముఖం పట్టినారుపొద్దుగూకు వేళకు !
నేటికింకసేదదీరి,నవచైతన్యముతో రేపటి తమ పొట్టకూటి పనులకు,పునరంకితమవ్వగా...నేటికిఁక స్వస్తి చెప్పే... ఈకర్మ యోగులు !
వీరు అపర భాస్కరులు !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి