పువ్వా ఓపువ్వా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వా పువ్వా
నీ నెలవెక్కడా
తోటా
కాదు కాదు

పువ్వా పువ్వా
నీ తావెక్కడా
మొక్కలుకొమ్మలా
కాదు కాదు

పువ్వా పువ్వా
నీ వాసమెక్కడా
పడుతులతలలా
కాదు కాదు

పువ్వా పువ్వా
నీ స్థావరమెక్కడా
పరమాత్మునిపాదాలా
కాదు కాదు

పువ్వ పువ్వా
నీ నిలయమెక్కడా
ప్రజలమనసులా
కాదు కాదు

పువ్వా పువ్వా
నీ నివాసమెక్కడా
విగ్రహాలుపటాలా
కాదు కాదు

పువ్వా పువ్వా
నీ ఆవాసమెక్కడా
కవులుకవితలా
ఔను ఔను

పూలమనసు
తెలుసుకో
పూలభాష
నేర్చుకో

పూలసొగసు
క్రోలుకో
పరిమళాల
పీల్చుకో

పూలంటే
నాకిష్టం
నేనంటే
పూలకిష్టం


కామెంట్‌లు