సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అక్షయ పాత్ర..‌. అక్షర పాత్ర
 ******
అక్షయ పాత్ర అనగానే ఇతిహాసం కథ గుర్తుకు వస్తుంది. మహాభారతంలో అక్షయ పాత్ర  ఎవరికి ఎలా ఉపయోగపడిందో తెలుసు.
అక్షయం అంటే తరగనిదని అర్థం. అందులోంచి ఎంత తీసుకున్నా ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది.
విజ్ఞానం కూడా అక్షయ పాత్ర లాంటిదే.ఎంత సంపాదించుకున్నా తరగని నిధి, ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది.
మానవ జీవితంలో అక్షర పాత్ర అమోఘం, అమూల్యం.అది జీవితాన్నే మార్చేస్తుంది. భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తుంది.
సమాజంలో గౌరవం, హోదా కల్పించడమే కాకుండా జీవన భృతిని, ద్యుతిని ఇచ్చే అక్షయ భాండం.
 కాబట్టి అక్షరాన్ని సాధనంగా చేసుకుని అక్షయ పాత్ర లాంటి విజ్ఞానాన్ని నిరంతరం తోడుకుందాం. విద్యా విజ్ఞాన వెలుగుల దివ్వెగా భాసిల్లుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు