పలకరింపు
=========
1601.
తియ్యగా పలకరించు
ఊరటగా అనిపించు
హాయిని చేకూరుచు
ధైర్యం ప్రసాదించు
1602
నిర్వేదం పోగొట్టును
దుఃఖాన్ని తగ్గించును
సాంత్వనను ఇచ్చును
ఔషధంగా పనిచేయును
1603.
ఆప్యాయంగ పలకరించు
ఆత్మీయతను చూపించు
నిస్పృహను తొలగించు
నిరాశను తగ్గించు
1604
మధురంగా ఉండును
ప్రేమజల్లు కురిపించును
స్నేహాన్ని కలుపును
వ్యక్తిత్వం చెప్పును
1605.
మనసులోతును చెప్పును
చాతుర్యం తెలియును
క్రమమార్గంలో పెట్టును
హోదాను పారద్రోలును
1606
ఆయుష్షును పోయును
అనారోగ్యం తగ్గించును
సంతోషాన్ని ఇచ్చును
భరోసా కలిగించును
1607
శక్తిని అందించును
బలం చేకూర్చును
మధురంగా అన్పించును
సంతృప్తిని ఇచ్చును
1608
మనోభావం తెలుపును
ఉద్దేశ్యాన్ని బయటపెట్టును
విజ్ఞతను చెప్పును
వివేకమెంతో తెలియును
1609
హోదానసలు చూడదు
అంతస్తులను లెక్కించదు
పెడర్థాలు తీయదు
ఆదర్శం వల్లించదు
1610.
భాష అవసరంలేదు
చిరునవ్వులు వదలదు
లాలిత్యం పోగొట్టుకోదు
సహనాన్ని కోల్పోదు
1611.
చిరాకును వదిలించు
అనుభూతిని అందించు
నిర్వేదాన్ని తొలగించు
చిరుగాలిలా ధ్వనించు
1612
పెడతోవను తప్పించు
ఊరడింపు కలిగించు
ఉత్సాహం అనిపించు
మంచిమార్గం చూపించు
1613
ఉద్దేశ్యాన్ని చెప్పును
అభిప్రాయం తెలియును
భావనను కలిగించును
సాంత్వనను ఇచ్చును
1614
మనోక్షేత్రం వికసించు
మానవత్వం ప్రకాశించు
తత్తరబాటును తొలగించు
మనసులోతు గ్రహించు
1615
మర్యాదెంతో చెప్పును
మనసును ఇప్పిచెప్పును
మౌనంగా సంభాషించును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి