*రుబాయీలు ; -ఎం. వి. ఉమాదేవి, బాసర
ఒక్కొక్కరి అదృశ్యమే మనసుకలచి వేస్తున్నది 
జాతస్య మరణంధృవo అని ఋజువు చేస్తున్నది 
భవబంధాలేవో ఇక లోకాన్నిటు నడుపుతుండె 
శాశ్వతంగ ఉండాలని మది అర్రులు చాస్తున్నది !!
~~~~
ప్రముఖులనూ వదలదేమి కరుణలేదు మరణానికి 
వినయంగా ఉన్నారని విలువలేదు మరణానికి 
వయసుచూసి జాలిపడదు వారిముందు సిగ్గుపడదు 
రాజీపడుతున్నదేమొ మహిమలేదు మరణానికి !!

కామెంట్‌లు