సుప్రభాత కవిత ; -బృంద
చేయిజాచిన ఇలకు
చేయికలిపిన ఇనుడు

పరవశించిన నేలకు
పచ్చదనమిచ్చిన మిత్రుడు 

సాగుతున్న  ఏటి నీటికి
తోడునౌతా అంటున్న 
భానుడు

తెల్లబోయిన దిక్కులకు
వెలుగుల వెల్ల వేసిన అర్కుడు

పొంగిపోతున్న పాలమబ్బులకు
పసిడి రంగులద్దిన పూష్ణుడు

ఇంద్రధనుస్సు  రంగులన్ని
నింగిలో నింపిన హిరణ్యగర్భుడు

జగతినంతా జాగృతం చేస్తూ
జడత్వం రూపుమాపే జగచ్చక్షువు

క్రమం తప్పక ఉదయించి
మనకు మరో అవకాశమిచ్చే
దినకరుడు.

సృష్టి  సమస్తానికీ  మంగళం
ప్రసాదించే శుభకరుడు

అయిన సూర్యనారాయణ మూర్తి
ఆగమనాన్ని స్వాగతిస్తూ

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు