నవదుర్గల హరతులు;-చంద్రకళ. యలమర్తి
1.చల్లని చూపుల భక్తుల కాచే దుర్గమ్మకు 
చంద్ర హారతి!

2. బాలగ ప్రేమనుకురిపించే త్రిపుర సుందరికి 
నక్షత్ర హారతి!

3.జ్ఞానము నిచ్చే గాయత్రీ మాతకు
 కోటి దీప హారతి!

4.ఆకలి దప్పులు తీర్చే తల్లి అన్నపూర్ణకు 
నవరత్న హారతి!

5. కోరిన కోర్కెలు సులువుగతీర్చే
శ్రీ లలితాంబకు పచ్చలహారతి!

6.సంపదలనొసగే మహాలక్ష్మీకి 
పసిడి పూల తో మంగళ హారతి!

7.వాణిగ విద్యల నొసగే తల్లికి 
వెలుగులు పంచే సూర్య హారతి!

8.దనుజులఅణచే మహిషా సుర మర్దినికి 
ఎఱ్ఱని కెంపులు హారతి!

9.ముజ్జగములనేలే రాజరాజేశ్వరి
కి ముత్యాల హారతి


**


కామెంట్‌లు
Unknown చెప్పారు…
నవ రాత్రులలో నవ హారతుల నీరాజనాలు 👌👌🙏🌹