కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో బోయి భీమన్న మరియు తాపీ ధర్మారావు గార్ల జయంతి మహోత్సవాలు.

 స్థానిక కర్నూలు కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోని లైబ్రరీ ప్రాంగణంలో ఘనంగా బోయి భీమన్న మరియు తాపీ ధర్మారావు గార్ల జయంతి మహోత్సవాలు జరిగాయి.
కార్యక్రమంలో కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు బోయి భీమన్న మరియు తాపీ ధర్మారావు గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం బోయి భీమన్న  సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి,తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి,రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ,సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న గారు. పేదరికంతో పాటు,అంటరానితనం వంటి దురాచారాలు చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే అతను వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారని తెలియజేశారు.మరియు తాపీ ధర్మారావు గారి జయంతి సందర్భంగా నేడు తెలుగు మాధ్యమ దినోత్సవం జరుపుకుంటాము. తాపీ ధర్మారావు గారిని అందరూ గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు . 
కామెంట్‌లు