- డా.గౌరవరాజు సతీష్ కుమార్
తలచుకుంటేనే 
—-------------------
బాలలను తలచుకుంటేనే 
నేను సరమై, సంబరమై,
అంబరమై పోతా!

బాలలను తలచుకుంటేనే 
నామది కంజమై, కంపనమై,
ఉంభనమై పోతుంది!

బాలలను తలచుకుంటేనే 
నా హృది గోపీఠమై, గోకులమై, 
చిదంబరమై పోతుంది!

బాలలను తలచుకుంటేనే 
నామాట సంగీతమై, సంవేదమై, 
మనోరంజనమై పోతుంది!

బాలలను తలచుకుంటేనే 
నా పాట అమృతమై, అంబుదమై, 
ఉద్దీపనమై పోతుంది!

బాలలను తలచుకుంటేనే 
నాఆలోచన ఆంకురమై, 
మంజరమై, శింజితమై పోతుంది !!
++++++++++++++++++++++++++
{సరము = దండ; సంబరము= సంతోషము; 
అంబరము= ఆకాశము;కంజము = పద్మము; 
కంపనము = కదలిక; ఉంభనము = నిండిపోవడం;
గోపీఠము = వేకువ, ప్రభాతము; గోకులము= వ్రేపల్లె; 
చిదంబరము = ఆకాశము; సంగీతము = గానము;  
సంవేదము = చక్కగా తెల్పడం; 
మనోరంజనము = మనసుకు ఆనందము; 
అమృతము = సుధ, నీరు, పాలు, నేయి; 
అంబుదము = మేఘము; ఉద్దీపనము= పురికొల్పడం; 
అంకురము=మొలక; మంజరము=పూలగుత్తి; 
శింజితము=భూషణముల శబ్దము}
*********************************
.

కామెంట్‌లు