స్వేచ్ఛాoశం;-సుమ కైకాల
1. తెలుగు భాష
    తేనెలొలుకుతుంది
    అమ్మప్రేమలా!

2. అక్షరమాల
    అనురాగపూరితం
    అoతానువ్వేగా!

3. మనసునిండా
    ఎగసే తరంగాలు
    నీఎడబాటే!

4. ఉద్యోగులంతా
    శ్రామిక వర్గానికి
    సూత్రధారులే !

5. ఎంతబాగుందో 
    అందంగా గుచ్చుతున్న
    అక్షరదండ !

కామెంట్‌లు