ఆకాశవాణి కేంద్రాల లో పనిచేస్తున్న వారిని ఏ భాషా కేంద్రాలు ఉంటాయో అక్కడ పనిచేస్తున్న వ్యక్తులను పంపడానికి ఎన్నిక చేసి ఐదు రోజులు కానీ, పది రోజులు కానీ వుండే చర్చా కార్యక్రమాలకు పంపిస్తారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో రేడియో అంటే తెలిసిన పెద్దలను ఆహ్వానించి నాటకాల గురించి సంగీతాన్ని గురించి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో నిపుణులను ఎన్నిక చేసి వారికి తెలిసిన విషయాలు వారు చెప్పిన తర్వాత ముఖాముఖిగా మా ప్రశ్నలకు వారు సమాధానాలిస్తారు. అప్పుడు కార్యక్రమం బాగా ఉండడం కోసం కొత్త విషయాలు ఏమైనా వస్తే వాటిని మేము వ్రాసుకుని ఆచరణలో పెట్టడం కోసం ఈ ఏర్పాటు. ఒకసారి బెంగళూర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బెంగళూరు నగరంలో ఉన్న కొంతమంది ని పిలిచి వారి ప్రసంగాలను కూడా వినిపించారు కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. వచ్చిన వారిలో ఒకరు సంగీతం బాగా తెలిసిన వారు వారు విజయవాడ కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూస్థానీ కర్ణాటక రెండు సంగీత ప్రక్రియలు తెలిసిన ఓలేటి గారి గురించి చాలా ఘనంగా మాట్లాడారు బడేగులాం ఆలీఖాన్ గారి తర్వాత అంత సహజంగా పాడగలిగిన వారు ఓలేటి వెంకటేశ్వర్లు గారు అని కొనియాడారు. రెండవవారు సాహిత్యాన్ని గురించి మాట్లాడుతూ బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి చెప్పి వారి రచనలను ప్రస్తావిస్తూ కొత్తరకం బాణీలను కూడా సంగీతంలో సమకూర్చిన మేధావి అని వారి గురించి విశ్లేషించారు విజయవాడలో పని చేసిన మీరు వారి కార్యక్రమాలు వినడం మీ అదృష్టం అని మమ్మల్ని కూడా అభినందించారు.
రేడియో మాణిక్యం (1)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి