అహార్యము... ఆహార్యము
*****
అహార్యం, ఆహార్యం.. ఈ రెండు పదాలు అ,ఆలతో మొదలవుతాయి. రాసేటప్పుడు పొరపాటు చేస్తే అర్థమే మారిపోతుంది.కాబట్టి జాగ్రత్తగా రాయాలి.
అహార్యము అంటే అంటే హరింప శక్యం కానిది. చలింప జాలనిది అచలం,అద్రి,కొండ... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
మన మనసు కూడా అరిషడ్వర్గాలకు లొంగిపోకుండా అచలంగా ఉంచుకోవాలి. ఏమాత్రం చలించినా వ్యామోహాల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.కాబట్టి మనసు ఎల్లప్పుడూ అహార్యంగా ఉంచుకోవాలి.
ఇక ఆహార్యం అనగా వేషధారణ. రంగస్థలం మీద నటించే పాత్రలు ఎవరెవరో గుర్తు పట్టాలంటే, వారి ఆహార్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
చక్కటి ఆహార్యం ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది.
నిత్య జీవితంలో మన ఆహార్యాన్ని బట్టి కూడా మర్యాద మన్ననలు పొందడం చూస్తూ ఉంటాం. కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాల్లో ఆహార్యం ప్రత్యేక పాత్ర వహిస్తుంది.
కాబట్టి మన జీవన విధానంలో అహార్యంతో పాటు ఆహార్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి