దిడుగుఅనంతవేంకటరాధాకృష్ణప్రసాద్ (రాధశ్రీ) 65 వ జన్మదినం-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
కం.
కందకవిసార్వభౌముడు
కందాలనురచనజేయుకమనీయముగన్
కందముమకరందమనుచు
కందముతోక్రీడలాడుకలికితురాయీ!!!

02.
కం.
ఆశువుగాపద్యాలను
ఈశునికృపతోడజెప్పునేవేళైనన్
రాశులకొలదిగపద్యాల్
జాషువమాదిరిరచించుసరసులుమెచ్చన్!!!

03.
కం.
రాధశ్రీకందశ్రీ
రాధశ్రీపద్యమౌళిలక్షణయుతుడై
రాధశ్రీమాన్యశ్రీ
రాధశ్రీపద్యభాషిరమ్యతగూర్చున్!!!

04.
కం.
పద్యమెపరమాన్నమనుచు
పద్యమెతనకిష్టమనుచుపద్యమెపల్కున్
పద్యమెప్రాణమ్మనుచును
పద్యకవిత్వమ్ములోనప్రాభవమొందెన్!!!

05.
కం.
నేటినిజంపత్రికలో
పోటీతోనిత్యమితడుబోలెడుపద్యాల్
మేటిగవ్రాయుచుకీర్తిని
మూటలుగాకట్టుకొనియుమురియుచునుండున్!!!

06.
కం.
పద్యములోమాట్లాడుదు
పద్యములోమంచిచెడులుపద్యములందున్
పద్యములోసంతోషము
పద్యములోనందజేయప్రతిననుబూనెన్!!!


కామెంట్‌లు