సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;-మహమ్మద్ చాంద్ బేగం -చరవాణి:7702223558
సున్నితం ద్వితీయ వార్షికోత్సవ
వేడుకలు ఆకాశమంత సంబరాలు
ఉత్సవాలు ఉల్లాసంగా జరగాలని
చూడుచక్కని తెలుగు సున్నితంబు

సాహితీ బృందావన వనంలో
వెదజల్లే పరిమణాల కలాలతో
కవులు కవయిత్రుల రచనలు
చూడ చక్కని తెలుగు సున్నితం

సరళమైన విధానం సున్నితం
సరిక్రొత్త  విధానం సున్నితం
సునీత రూపకర్త సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ముచ్చటగా మూడు పదాలు
మూడు పాదములు కలిగి 
నాలుగవది మధురమైన పాదము
చూడచక్కని తెలుగు సున్నితం

ప్రతిభకు తగిన పురస్కారాలు
తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్
సమీక్షతో ప్రేరణిస్తున్న బృందం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు