పల్లెటూరి మిత్రులు;-డి .సాయి చరణ్;--తరగతి 8వ ఏ సెక్షన్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల, సిద్దిపేట సెల్ నెంబర్: 9951120076
 ఒక పల్లెటూరిలో సోహెల్, షణ్ముఖ అనే స్నేహితులు ఉండేవారు. షణ్ముఖ పరీక్షలు రాసి హాస్టల్ కి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక షణ్ముఖ హాస్టల్ నుంచి వాళ్ళ ఊరికి వచ్చాడు.షణ్ముఖ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక జోహేల్ షణ్ముఖ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు? నేను నిన్ననే వచ్చాను, మనం కలుసుకొని చాలా రోజులు అయినాయి కదా! రేపు మనం ఊరి మొత్తం తిరిగేసి వద్దాం. అలాగే అని సోహెల్ అన్నాడు. సోహెల్ ఉదయం లేవగానే వాళ్ళ తాత అనారోగ్యంతో బాధపడడం చూశాడు. తను వాళ్ళ తాత దగ్గరే సేవ చేసుకుంటూ ఉందామని అనుకుంటాడు. ఆ లోపలనే చర్మూక్ వచ్చాడు.సోహెల్ అన్నాడు నేను ఈరోజు ఊరి చూడడానికి నేను రాను అని అన్నాడు. కొన్ని రోజుల నుంచి వాళ్ల తాతను సోహెల్ ని గమనిస్తాడు. ఎందుకంటే నేను పడుకోక ముందు వాళ్ళు నా దగ్గరనే ఉండేవాళ్ళు. నేను పడుకోగానే వాళ్ళు ఊరు తిరిగేడానికి వెళ్లేవాళ్లు. ఇలాగైతే వాళ్లు బాగుపడరు అని పొలం పనికి పంపించారు. వాళ్లు స్టార్టర్ వైర్లు ఆగమాగం లో పెట్టి ఊరు తిరగడానికి వెళ్లారు! అలాగే వాళ్ళ తాత పని చెప్పినప్పుడు అలా చేసి ఊరు తిరగడానికి. ఒకరోజు వాళ్ల తాత పొలం దగ్గరికి వెళ్ళాడు.. చాటర్ వైర్లు తప్పుగా పెట్టారు అని సరిగ్గా పెట్టడానికి తీస్తాడు తాత. సాటర్ వైర్లను పట్టుకోగానే కరెంట్ షాక్ వచ్చి అక్కడనే పడిపోతాడు తాత. కొంత సమయం తరువాత సోహెల్ షణ్ముఖ అక్కడికి వచ్చారు. వాళ్లు తాతని కింద పడడం చూసి సో హెల్త్ తాతయ్య అని వెళ్ళాడు. షణ్ముక్ కూడా వెళ్ళాడు. భయపడి ఏడిచారు కొద్ది సమయం తరువాత లేచి దగ్గరికి తీసుకున్నారు. మీరు రోజు పని చెప్పితే ఇలానే చేసి ఊరు తిరగడానికి వెళుతున్నారు కదా అని తాత వాళ్లతో అన్నాడు. గుడ్ ఈవెనింగ్ సోహెల్ షణ్ము ఖ వాళ్ళిద్దరూ నన్ను క్షమించండి తాతయ్య గారు అని చెప్పారు. వాళ్ల తాత నాకు ఏం కాలేదు మీరు ఇద్దరికీ గుణపాఠం తెలవాలని చేశాను.
నీతి: పెద్దవారికి గౌరవం ఇయ్యాలి, చిన్న వారి దగ్గర గౌరవం తీసుకోవాలి మనకెప్పుడైనా పెద్దవారు పని చెబితే సక్రమంగా చేసి చూపెట్టాలి.

కామెంట్‌లు