రైతు కష్టం;;- దుంపాలా.రాజ్ కుమార్--.9వ తరగతి.ఇంజాపూర్--చరవాణి.9392576737
  రైతు లేనిది ఈ
లోకం లేదు
నాటి కాలంలో
రైతు రాజుల బ్రతికేవాడు  ...!


కానీ ఇప్పుడు
అందరి ముందు
 బానిసలా
 బ్రతుకుతున్నాడు  ...!


ఇలా అయితే రైతులు
ఒక్కొక్కరిగా పంటలు పండించడం
ఆపివేస్తారు ...!


ఇలా జరుగుతే మనం ఏమి తినకుండా పస్తులు ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనం తప్పకుండా చనిపోతాం ...!

 అందుకే రైతుని
 మనం గౌరవించాలి
రైతుని చులకగా
చూడకూడదు  ...!


రైతుకి సరైన ధరకే
మనం కూరగాయలని తీసుకోవాలి అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారూ ...!
 రైతుని మనం కచ్చితంగా రాజు లాగా చూడాలి  ...!

కామెంట్‌లు