ధైర్యం;-దుంపాలా. రాజ్ కుమార్ -;9వ తరగతి-.ఇంజాపూర్-- చరవాణి 9392576737
  అనగనగా ఒక గ్రామంలో సోము రాము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. సోముకి చీకటి అంటే భయం. ఎక్కడెక్కడ దయ్యాలు వస్తాయో అని ఎప్పుడూ భయం ఉండేది .రాముకి ఏమో ఎంత చీకటిగా ఉన్న భయపడక పోతుండే.
 ఒకరోజు రాతిరి రాము కాళు విరిగింది అని కావాలని సోము ముందల నటించాడు . ఎందుకంటే అతని భయం పోవాలని అలా చెప్పాడు. అప్పుడు సోము బయటికి వెళ్లడానికి భయపడ్డాడు
తను  మాత్రలు తీసుకోవడానికి  బయటికి వెళ్ళాడు. తన కుక్కను కూడా తీసుకువెళ్లాడు. తను చాలా భయపడుకుంటూ వెళ్ళాడు కానీ వెళ్లేటప్పుడు ఆ కుక్క ఒకరిని చూసి మొరిగింది దాన్ని చూసి రాము దయ్యం అనుకున్నాడు. అతను దగ్గరికి రాగానే అతనితోని మాట్లాడాడు. అప్పుడు తెలిసింది ఉండేది మనషులేనని దయ్యాలు ఉండవని అతనికి కొంచెం ధైర్యం వచ్చింది.
 ఇంకా ముందల కి వెళ్ళగానే పక్షులు అరుస్తున్నాయి ముందల ఒక పెద్ద బావి ఉంది దాన్ని చూసి రాము చెట్టు మీద ఏదో ఉందని దాక్కున్నాడు చెట్టు మీద నుంచి ఒక పక్షి వచ్చి ఆ బావిలో స్నానం చేసింది.అప్పుడు తెలిసింది పక్షులు శబ్దం చూసి ఏమో అని అనుకోవద్దు పక్షులని మనం గుర్తించాలి అని అనుకున్నాడు. అప్పుడు రాముకి పూర్తిగా ధైర్యం వచ్చింది.
 అప్పుడు రాము ఆనందపడ్డాడు.


 నీతి.....భయం అనేది ప్రతి మనిషికి ఉండేదే  దానిని పక్కకి తొలగించి ధైర్యంగా ఉండాలి.

కామెంట్‌లు