సహాయమే మిన్న ; - వి. నందిని 9వ తరగతి 'ఈ' సెక్షన్ సిద్ధిపేట --సెల్ 9959906527

 అనగనగా ఒక ఊరిలో ఒక ముసలి ఆమె ముసలివాడు ఉండేవారు. వాళ్లకి డబ్బు ఉండదు వాళ్ల కొడుకులు కూడా చూసేవారు కాదు అయితే వాళ్లు గుడిలో రోడ్లపై అడుక్కుంటూ ఉండేవారు .కానీ ఎవరు డబ్బు వేసేవారు కాదు అయితే .ఒక రోజు ముసలి ఆవిడ అడుక్కుంటున్నప్పుడు రోడ్డుపై ఒక గర్భిణీ పడిపోయి ఉంటుంది .అక్కడ ఉన్న ముసలి ఆవిడ తనకి నీరు ఇచ్చి రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపుతుంది .ఒక వ్యక్తి ఆగుతాడు ఆ ముసలి ఆవిడ తనని ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్తుంది తాను కూడా వెళ్తుంది ఆ గర్భిణీ తన ప్రాణం మంచిగా అయ్యేంతవరకు ముసలి ఆవిడ తనతోనే ఉండి తన ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే తను వాళ్ళింట్లో విడిచిపెట్టి గర్భిణి వాళ్ళ భర్త ఆ ముసలి ఆమెకి కొంచెం డబ్బు ఇచ్చి వాళ్లకు ఇల్లు కట్టిస్తాడు. అప్పుడు ఆ ముసలి ఆమె ముసలివాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాగే గర్భిణీ వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పుడు. ఒక వ్యక్తికి బాగా ప్రమాదం జరుగుతుంది అప్పుడు ఆ ముసలి ఆవిడ గుర్తు వచ్చి అక్కడ ఉన్న వ్యక్తిని లేపి ఆసుపత్రికి తీసుకెళ్తాడు తన గాయం తగ్గేంతవరకు ఉండి డాక్టర్ కి కావాల్సినంత డబ్బు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచి వస్తాడు .ఆ దంపతులు   డబ్బున్న వారు అవుతారు . ఆ దంపతులు ఉన్న డబ్బుతో వేరే వారికి సహాయం చేస్తారు ఇదంతా తెలిసిన వాళ్ళ కొడుకులు వస్తారు. వాళ్ళ అమ్మ అడుగుతుంది! మీరు డబ్బు ఉంటేనే వస్తారా అని అప్పుడు వాళ్ళ కొడుకులు కన్నీళ్లు పెట్టుకొని క్షమాపణ అడుగుతారు వాళ్ళ అమ్మ క్షమిస్తుంది అప్పటినుంచి వాళ్లు కలిసి మెలిసి ఉంటున్నారు.
నీతి: డబ్బు అనేది ఈరోజు వస్తుంది రేపు పోతుంది కానీ ఎవరికైనా సహాయం చేస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది
కామెంట్‌లు