సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుక; వనపర్తి గంగాధర్-చరవాని:9440146435
సాహితీ బృందావన జాతీయ వేదిక
***********
సున్నితాలు సునీతమ్మ మానసపుత్రికలు
తెలుగు సాహితీ జాగత్తున
నూతన కవన ప్రక్రియ
చూడచక్కని తెలుగు సున్నితంబు

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు
సిద్ధమై వెలుగులీనుతున్న హరివిల్లులు
నూతన కవులకు వరములు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ముచ్చటగా మూడు పదాలతో
అల్లుకున్న నాలుగు పాదాలు
నవరసాల విరి జల్లులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చూడచక్కని సున్నిత భావాలు
ఒదిగెను సున్నిత రూపాలుగా
అలరించెను సాహితీ జగత్తును
చూడచక్కని తెలుగు సున్నితంబు

సరళ శతకమై వర్ధిల్లును
ముందు తరాలకు వారదౌను
సున్నితాలు సృష్టించును అద్భుతాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు